Director Vijaya Bhaskar About Hero Tarun : తరుణ్.. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ లో దూసుకుపోయిన హీరో. కామెడీ, ఎమోషన్స్ జోనర్ ఏదైనా తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించాడు. అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు తరుణ్. వరుస ఫ్లాప్ లు రావడం, సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆయన ఆపేశారు. అయితే, తరుణ్ ఒక్కసారిగా ఫేడ్ ఔట్ అవ్వడంపై దర్శకుడు విజయ్ భాస్కర్ స్పందించారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.
తరుణ్ అందుకే ఫేడ్ ఔట్ అయ్యారు..
తరుణ్ ఫేడ్ ఔట్ అవ్వడానికి కారణం ఏంటని అడిగిన ప్రశ్నకి ఆయన ఇలా చెప్పారు. "'భలే దొంగలు' సినిమాలో కూడా పెట్టేందుకు ట్రై చేశాను. ఆ సినిమాలో కూడా చాలా ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్. కానీ నిజానికి అందరూ ఆ సినిమా 'బంటి ఔర్ బబ్లీ' రీ మేక్ అనుకుంటారు.. కానీ కాదు. వీళ్లంతా సినిమాలు చూడకుండా రాసేస్తారు. 'బానీ అండ్ క్లైడ్' అనే సినిమాను 'బంటీ అండ్ బబ్లీ'గా తీశారు. జీన్ యాప్ మన్ బదులు అమితాబ్ గారు చేశారు. నేను జగపతి బాబును పెట్టాను. కానీ మన స్టోరీ వేరే, వాళ్ల స్టోరీ వేరు. ఇక్కడ చిన్న పిల్లల క్యారెక్టర్ ఉంటుంది. హాస్పిటల్ లో ఉంటుంది. ఇలియానా ఆ అమ్మాయిని కాపాడదామా? అని అడుగుతుంది. నా స్టోరీ నరేషన్ వేరేలా ఉంది. అలా మొత్తం డిఫరెంట్ స్క్రిప్ట్. నేను అప్పుడు తరుణ్ కి చెప్పాను చేయమని. కానీ అవ్వలేదు."
యాక్షన్ సినిమాలు చేయాలనుకున్నాడు..
"అందరూ యాక్షన్ సినిమాలు చేసి, ఫైట్లు అవి చేస్తున్నారు. నీకు అక్కర్లేదు అవి. నీ ఆడియెన్స్ నీకు ఉంటారు. నీ సినిమాలు నీకు ఉన్నాయి అని చెప్పాను. మంచి యాక్టర్ కూడా తరుణ్. నేను అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఒకవైపు అమితాబ్ బచ్చన్ సినిమాలు ఆడుతుంటే మరోవైపు అమోల్ పాలేకర్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పాను. ఎవరో వేరేవాళ్లలా సినిమాలు చేయాలని ట్రై చేయొద్దు అని చెప్తాను. నేను అందుకే నా సొంతంగా, నాకు అనిపించినట్లే చేస్తాను. అలా యాక్షన్ సినిమాల కోసం వెయిట్ చేశాడు అనుకుంట. రెండు సినిమాలు కూడా చేసినట్లు ఉన్నాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ తను చాలా ఇంటలిజెంట్. ఒక్కోసారి ఒక్కొక్కరికి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో. చెప్పలేం.. ఎవ్వరికి, ఎప్పుడు, ఎలా టైం వస్తుందో. స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అయితే.. కచ్చితంగా తరుణ్ తో సినిమా చేస్తాను" అని విజయ్ భాస్కర్ చెప్పారు.
తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరో కూడా చాలా సినిమాల్లో నటించాడు. 'నువ్వేకావాలి', 'నువ్వ లేక నేను లేను' లాంటి మంచి మంచి సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు తరుణ్. ఒక వెబ్ సిరీస్, ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు.