Bellamkonda Sai Srinivas BHAIRAVAM: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ టైటిల్ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? ఆ పోస్టర్ విశేషాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2021లో 'అల్లుడు అదుర్స్' సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత 'చత్రపతి' హిందీ రీమేక్ అంటూ బాలీవుడ్ రీమేక్ తీసి చేతులు కాల్చుకున్నాడు. ఆ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత శ్రీనివాస్ తెలుగులో సినిమా అప్డేట్ ఇవ్వడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టిన శ్రీనివాస్ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మూవీకి 'భైరవం' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తాజాగా ప్రకటించారు.


డైరెక్టర్ విజయ్ కనకమేడల అల్లరి నరేష్ తో ఇప్పటికే 'నాంది', 'ఉగ్రం' వంటి సినిమాలను తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక 'భైరవం' మూవీ పోస్టర్లో బెల్లంకొండ శ్రీనివాస్ గుడి ముందు చేతిలో త్రిశూలం పట్టుకుని ఓ చేతిలో కొడవలితో ఉగ్రరూపంలో దర్శనమిచ్చాడు. అలాగే ఈ పోస్టర్ లో ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ అవతార్ లో కన్పించి సినిమాపై బజ్ పెంచేశారు. అలాగే వెనక రావణ దహనం, టెంపుల్ కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఊరంతా చేతిలో కాగడాలు పట్టుకుని చుట్టూ నిలబడం కూడా కన్పిస్తోంది. ఆ పోస్టర్ ని చూస్తుంటే ఇది అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన సీన్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.






కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ 'భైరవం' అనే సినిమాతోనైనా హిట్ అందుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టైటిల్, దానికి సంబంధించిన పోస్టర్ చూస్తుంటే ఈ మూవీకి మైథాలజికల్ టచ్ ఉండబోతుందా అనే డౌట్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా భాగం కబోతున్నట్టు కన్పిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ మంచు మనోజ్, నారా రోహిత్ ని కూడా ట్యాగ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీన్నిబట్టి ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్ మంచు మనోజ్ వంటి యంగ్ స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తేనే క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే 'టైసన్ నాయుడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.



Read Also :Appudo Ippudo Eppudo Trailer: ‘రియా ఎక్కడ’ టైప్‌లో ‘డివైస్ ఎక్కడ’ - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ చూశారా?