Venu Sriram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే రికార్డులు బద్దలు కవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన  సినిమా ‘వకీల్ సాబ్’. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ 2021 ఏప్రిల్ నెలలో రిలీజ్ అయింది. ఓ వైపు కరోనా పరిస్థితులు, మరోవైపు టికెట్ ధరల నియంత్రణ ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మూవీ విడుదల అయిన సంచలన విజయం అందుకుంది. ఈ మూవీతో పీకే ఫ్యాన్స్ దట్ ఈజ్ పవన్ క్రేజ్ అంటూ సంబరపడిపోయారు. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల దర్శకుడు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్ 2’ ఉందని క్లారిటీ ఇవ్వడంతో పీకే అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


‘వకీల్ సాబ్’ సినిమా రీలీజ్ అయి ఏప్రిల్ 9, 2023 నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ట్విట్టర్ లో గ్రాండ్ గా ఒక స్పేస్ ను నిర్వహించారు. ఈ స్పేస్ కు మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ సందర్భంగా ‘వకీల్ సాబ్’ సీక్వెల్ గురించి అభిమానులు అడగ్గా వేణు శ్రీరామ్ దానిపై స్పందించారు. ‘వకీల్ సాబ్’ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, దీనిపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని క్లారిటీ ఇచ్చారు వేణు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 


‘వకీల్ సాబ్’ సినిమా పూర్తిగా ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదల అయిన కూడా మంచి వసూళ్లను సాధించింది. అవి కరోనా రోజులు.. అప్పుడప్పుడే కరోనా తగ్గి ప్రజలు రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా రారా? అనే డైలమా లో సినీ ఇండస్ట్రీ ఉంది. ఎన్నో సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. కానీ రిలీజ్ చేయడానికి ఎవరూ సాహసం చేయడంలేదు. అలాంటి టైమ్ లో నేరుగా థియేటర్లలో విడుదల అయింది ‘వకీల్ సాబ్’. దీంతో మళ్లీ ప్రేక్షకుల థియేటర్లకు క్యూ కట్టారు. సినిమాను సూపర్ హిట్ చేశారు. అయితే రెండు వారాల్లోనే కరోనా వలన థియేటర్లను క్లోజ్ చేసేశారు. అప్పటికే ‘వకీల్ సాబ్’ కు 90 కోట్ల వసూళ్లు వచ్చేశాయి. మరికొన్ని రోజులు ఉండుంటే వంద కోట్ల క్లబ్ లో మూవీ చేరేదని అనుకున్నారు ఫ్యాన్స్. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ ‘వకీల్ సాబ్ 2’ వార్తలపై దర్శకుడు వేణు క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానుల్లో  కొత్త ఉత్సాహం మొదలైంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా మూవీకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారని ఫిల్మ్ వర్గాల టాక్.


Also Read : ఎన్టీఆర్ సాంగులో హుక్ లైన్ టైటిల్‌ గా, సింగిల్ క్యారెక్టర్‌ తో సినిమా