Prabhas 'The Raja Saab' Movie Beyond Fans Expectations: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేసింది. వింటేజ్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ అదరగొట్టారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నవ్విస్తూనే భయపెట్టారు డైరెక్టర్ మారుతి. టీజర్ గూస్ బంప్స్.. మూవీ కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరూ ఊహించని స్టోరీ..
ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ ఎలా ఉంటుందో ఎవరూ ఊహించరని డైరెక్టర్ మారుతి అన్నారు. టీజర్ లాంచ్ తర్వాత మూవీ టీం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'టీజర్‌తో ఈ ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశాను. సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకు ఏమాత్రం అందదు. ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. క్వాలిటీ కంటెంట్ అందించేందుకు మేము ఎంతో శ్రమిస్తున్నాం.' అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ సింబల్స్‌తో పోస్ట్ చేస్తున్నారు.
ఎమోషనల్ డే
ఇది తనకు చాలా ఎమోషనల్ డే అని మారుతి అన్నారు. 'నేను చెప్పిన స్టోరీ గురించి ప్రభాస్ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ఆయనతో ఎలాగైనా ఈ సినిమా చేయాలనిపించింది. ప్రభాస్‌తో హారర్ కామెడీ మూవీ అంటే మా ఇంట్లో వాళ్లు కూడా సందేహం వ్యక్తం చేశారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు 'మారుతితో సినిమా అవసరమా?' అని ఆయన్ను చాలామంది అడిగారు. ఆయన మాత్రం నన్ను నమ్మి నా కోసం నిలబడ్డారు. ఫ్యాన్స్ కోసం వింటేజ్ డార్లింగ్, పాన్ ఇండియా బుజ్జిగాడిని చూపించాలనుకున్నాం. అలాగే చేశాం.' అని చెప్పారు మారుతి.
'నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'
పదేళ్లుగా మిస్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఈ చిత్రం మీ ముందుకు తీసుకు వస్తుందని ప్రముఖ నిర్మాత, మారుతి స్నేహితుడు ఎస్కేఎన్ అన్నారు. 'ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఓ నిర్మాత నెగెటివ్ కామెంట్ చేశాడు. రేపు ఆ నిర్మాతే పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. నా ఫ్రెండ్ మారుతి. 20 ఏళ్లుగా ఆయనతో ప్రయాణిస్తున్నా. ఈ మూవీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. డిసెంబర్ 5న ఇండియా షేక్ అవుతుంది.' అని ఎస్కేఎన్ అన్నారు.
టీజర్ గూస్ బంప్స్ అంతే..
ఈ మూవీ టీజర్‌లో వింటేజ్ ప్రభాస్‌ను చూపించారు మారుతి. లవ్, రొమాన్స్, హారర్, కామెడీ అన్నీ కలగలిపి ఫర్ ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఓ భవనంలో మహారాజు ఆత్మ, దెయ్యాలు.. రాజ సంపద.. మొత్తాన్ని దక్కించుకునేందుకు చేసే ప్రయత్నాలు.. లవ్, కామెడీ ట్రాక్.. ఇలా అన్నింటీని స్టైలిష్ లుక్‌లో అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌ను చూడాలంటే డిసెంబర్ 5 వరకూ ఆగాల్సిందే.