Prabhas's The Raja Saab Teaser Released: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది పండుగే. 'రాజులకే రాజు మా ప్రభాస్ రాజు' అనేలా దేశమంతా రెబల్ వైబ్ కనిపించేలా 'ది రాజా సాబ్' టీజర్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు నిజంగా ఫుల్ ట్రీట్ ఇచ్చేలా సరికొత్త డిఫరెంట్ లుక్‌లో వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అనేలా టీజర్ అదిరిపోయింది.

టీజర్ ఎలా ఉందంటే?

ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌ మూవీలో ప్రభాస్ నటించగా.. ఆయన వైబ్స్‌కు తగ్గట్లుగా రెబల్ మేనియా దేశమంతా కనిపించేలా మూవీని రూపొందించారు డైరెక్టర్ మారుతి. 'ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రాణం.. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను.' అంటూ అడవిలోని ఓ కోటలో భారీ రాజ భవనంలో ఓ వృద్ధ మహారాజు ఆత్మ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. 

భవనంలో దెయ్యాలు, ఆ వైబ్ భయపెడుతుండగా.. ఒక్కసారిగా డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డార్లింగ్ లవ్ ట్రాక్, కామెడీ టైమింగ్‌తో కాస్త ఆ వైబ్‌కు బ్రేక్ వేయగా.. మళ్లీ ఆ భవనంలోకి ఎంట్రీ వేరే లెవల్‌లో ఉంది. తమన్ బీజీఎం మరింత హైలెట్‌గా నిలిచింది.

విజువల్స్.. అదుర్స్

ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌లో ప్రభాస్ కనిపిస్తుండగా.. రెబల్ మేనియా ఎక్కడా తగ్గకుండా టీజర్ రూపొందించారు మారుతి. భవనంలో ఘోస్ట్స్, పాత రాజ భవనం వైబ్స్.. మిస్టరీ విజువల్స్ అద్భుతం అనిపిస్తున్నాయి. 

స్టోరీ ఏంటి?

ఓ రాజ భవనం.. తన తదనంతరం కూడా సంపదపై మోజు తీరని ఓ మహారాజు. ఆ భవనానికి కాపలాగా అతనితో పాటే దెయ్యాలు. ఆ సంపద కోసం పోటీ పడే వారికి ఎదురైన పరిణామాలు. అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ స్టోరీ ఉండోబోతోందని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. భవనంలో ఓ దెయ్యాన్ని చూసి ప్రభాస్ సహా అంతా పారిపోతుండగా.. 'తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా..' అంటూ ప్రభాస్ భయపడుతూనే చెప్పే ఫన్నీ డైలాగ్ అదిరిపోయింది. ఫైనల్‌గా ఆ భవనానికి 'రాజా సాబ్' ప్రభాస్ ఎలా అయ్యాడో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. 

ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కు రీచ్ అయ్యేలా..

డార్లింగ్ ప్రభాస్ అంటేనే ఓ క్రేజ్. ఆ క్రేజ్.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగానే టీజర్ రూపొందించారు మారుతి. వన్ పర్సంట్ ఎక్కువే ఇస్తామని ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు. చెప్పినట్లుగానే రెబల్ స్టార్‌ను డిఫరెంట్ లుక్‌లో ఫ్యాన్స్ ఊహలకు కూడా అందని విధంగా చూపించి మెస్మరైజ్ చేశారు. వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ చూపించారు. ఇక థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: బ్యానర్లు రాసిన చోటే భారీ కటౌట్.. అరటి పండ్లు అమ్మిన తండ్రి - ప్రభాస్‌తో సినిమా తీసిన కొడుకు.. డైరెక్టర్ మారుతి కథ తెలుసా?

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు హీరోయిన్స్

టీజర్‌లో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ లుక్స్ అదిరిపోయాయి. ప్రభాస్, నిధి అగర్వాల్ లవ్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నిధి, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ టీజర్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.