ప్రముఖ దర్శకుడు, నిర్మాత మారుతి ఇంట విషాదం చోటు చేసుకుంది. మారుతీ తండ్రి దాసరి వన కుచలరావు(76) గురువారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్వగృహంలో కన్నుమూశారు. మారుతి తండ్రి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
‘బస్ స్టాప్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మారుతీ.. ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ‘ప్రేమ కథా చిత్రం’కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మారుతీ ‘కొత్త జంట’, ‘బాబు బంగారం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లడు’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ