Pawan Kalyan And Ravi Teja Wishes Harish Shankar A Happy Birthday: టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ ప్రతీ హీరో ఫ్యాన్‌ను తృప్తిపరిచే దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో హరీష్ శంకర్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన హరీష్.. ‘షాక్’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇండస్ట్రీలో మిగతా హీరోలతో పోలిస్తే రవితేజ, పవన్ కళ్యాణ్‌లతో హరీష్ శంకర్‌కు మంచి బాండింగ్ ఉంది. ఇక మార్చి 31న ఈ దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్, రవితేజ స్పెషల్ విషెస్ తెలిపారు. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా వీరి విషెస్‌ను బయటపెట్టారు. తన అప్‌కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ కూడా హరీష్‌కు విషెస్ తెలిపింది.
12 ఏళ్ల తర్వాత..
‘దర్శకులు శ్రీ హరీష్ శంకర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గబ్బర్ సింగ్, డీజేలాంటి చిత్రాలతో అందరినీ మెప్పించిన హరీష్ శంకర్‌కు ప్రేక్షకులు నాడి తెలుసు. సన్నివేశాల్లో, సంభాషణల్లో ఆయన శైలి కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. శ్రీ హరీష్ శకర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం’ అంటూ హరీష్ శంకర్‌కు ట్విటర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు పవన్ కళ్యాణ్. 12 ఏళ్ల క్రితం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా హిట్ సాధించాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.
హ్యాట్రిక్ సినిమా..
‘హ్యాపీ బర్త్ డే అబ్బాయి హరీష్ శంకర్. నీకు మంచి ఆరోగ్యం, సంతోషం, సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ హరీష్ శంకర్‌తో దిగిన ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేశారు రవితేజ. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి చిత్రాలు వచ్చాయి. ‘షాక్’తో తనకు డైరెక్టర్ అయ్యే మొదటి అవకాశాన్ని ఇచ్చారు రవితేజ. అందుకే తనపై ప్రత్యేకమైన ఇష్టం ఉందని పలుమార్లు బయటపెట్టారు హరీష్ శంకర్. ఇక త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం కూడా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. ఒకవైపు పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తూనే మరోవైపు ‘మిస్టర్ బచ్చన్’ను ప్రారంభించారు హరీష్ శంకర్. మరీ ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.
Also Read: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య బాబు.. నిర్మాతలు ఎవరో తెలుసా?