NBK Harish Shankar New Movie Update: హ‌రీశ్ శంక‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. క‌ర్నాట‌క‌కు చెందిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ హ‌రిశ్ శంక‌ర్ కి బ‌ర్త్  డే విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ గురించి ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ మొద‌లైంది. అదే హ‌రీశ్ శంక‌ర్, బాల‌య్య బాబు సినిమా. ఇక ఆ సినిమాకి క‌ర్నాట‌క‌కు చెందిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ్యూస్ చేస్తోంది అని టాక్ గ‌ట్టిగా న‌డుస్తోంది. 


హ్యాపీ బ‌ర్త్ డే హ‌రీశ్ శంక‌ర్.. 


"హ్యాపీ బ‌ర్త్ డే టూ అవ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిశ్ శంక‌ర్" అంటూ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది.  అయితే, హ‌రిశ్ శంక‌ర్, బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో ఒక సినిమా రాబోతోంది అనే వార్త గ‌త కొద్ది రోజులుగా ఫిలిమ్ న‌గ‌ర్ లో వినిపిస్తోంది. దానికి సంబంధించి ప‌నులు కూడా మొద‌లైపోయాయ‌నే వార్త‌లు గ‌ట్టిగానే వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ హ‌రిశ్ శంక‌ర్ కి ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డంతో ఆ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచే బాల‌య్య బాబు, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో సినిమా రిలీజ్ అవ్వ‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు అభిమానులు. ఇక మ‌రో 'గ‌బ్బ‌ర్ సింగ్' లాంటి ప‌వ‌ర్ ఫుల్ సినిమా రాబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్ట‌ర్ కి అంద‌రూ విషెస్ చెప్తున్నారు. 






 


ర‌వితేజ తో 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్'.. 


ప్ర‌స్తుతం హ‌రీశ్ శంక‌ర్ ర‌వి తేజ తో 'మిస్ట‌ర బ‌చ్చ‌న్' సినిమా తీస్తున్నారు. 'నామ్ తో సునా హోగా' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇటీవలే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హరీష్ ఎప్పటికప్పుడు ఈ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు.. ఇప్పుడు తాజా షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇక హ‌రీశ్ శంక‌ర్, ప‌వ‌న్ కల్యాణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా సంబంధించి రిలీజైన 'భ‌గత్స్ బ్లేజ్' ఫ్యాన్స్ ని తెగ ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అనేది ఎప్పుడో ఇంకా ప్ర‌క‌టించ‌లేదు మేక‌ర్స్. అభిమానులు ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. 


బాబీ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్ బీకే 109'  


ఇక బాల‌య్య‌బాబు ప్ర‌స్తుతం సరికొత్త కథాంశంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో 'NBK 109' మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫ‌స్ట్ గ్లింప్స్ కూడా ఇప్ప‌టికే రిలీజ్ అయ్యింది. ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమా రూపొందుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, 'వాల్తేరు వీరయ్య' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తెరక్కించిన బాబీ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  శివరాత్రి సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్‌ చేసి నందమూరి ఫ్యాన్స్‌కి పండగ ట్రీట్‌ ఇచ్చారు. ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌లో బాలయ్య లుక్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. డార్క్‌ థీమ్‌తో మలిచిన ఈ గ్లింప్స్‌లో బాలయ్య మార్క్‌కు ఏమాత్రం తగ్గని పవర్ఫుల్‌ డైలాగ్స్‌ ఉన్నాయి.


Also Read: ‘ఓపెన్‌హైమర్’ ఒక ప్రాపగాండా సినిమా - సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో!