AP Asssembly Elections 2024:  పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. ఇటు అధికార వైసీపీ, అటు కూటమిలోని పార్టీలు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశాయి. ఆయా అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కూడిన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 


పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే 
పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తానేటి వనిత వైసీపీ నుంచి పోటీ చేస్తోంది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి కంభం విజయరాజు పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చచెందిన సొంగ రోషన్‌ పోటీకి దిగుతున్నారు. కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. దెందులూరు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మరోసారి వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సీహెచ్‌ శ్రీరంగనాథ్‌ రాజు పోటీకి దిగుతుండగా, టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. 


పాలకొల్లు నుంచి వైసీపీ అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు పోటీ పడుతున్నారు. నిడదవోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా జి శ్రీనివాసనాయుడు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ బరిలోకి దిగుతున్నారు. పోలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిని బరిలోకి దింపుతున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఉంగుటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పుప్పాల వాసుబాబు పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన పత్సమట్ల ధర్మరాజు పోటీ చేయనునన్నారు. తాడేపల్లి గూడెం నుంచి వైసీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ పోటీ చేయనున్నారు.


నర్సాపురం నుంచి సిటింగ్‌ ముదునూరు ప్రసాదరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బొమ్మిడి నాయకర్‌ పోటీ చేస్తున్నారు. తణుకు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల నాని పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. భీమవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పీవీఎల్‌ నర్సింహరాజు పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మంతెన రామరాజు పోటీ చేస్తున్నారు.