ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (ఎఫ్ 2, ఎఫ్ 3) ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 2' అంటూ ప్రేక్షకుల వినోదం పంచిన ఆయన... 'ఎఫ్ 3' అంటూ నేడు థియేటర్లలోకి వచ్చారు. ఈ సినిమాతో ఫన్ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ వెయ్యడం లేదని, కంటిన్యూ చేస్తున్నామని 'ఎఫ్ 3' ఎండ్ కార్డ్స్‌లో అనౌన్స్ చేశారు. 


'ఎఫ్ 3' క్లైమాక్స్‌లో కథ సుఖాంతం అయిన తర్వాత... వెంకటేష్, వరుణ్ తేజ్, మిగతా ఆర్టిస్టులు అందరూ కలిసి గోవా ప్రయాణం అవుతారు. ఓ బస్సులో బయలు దేరుతారు. ఉన్నట్టుండి బస్ రూట్ మారుతుంది. ఇదేంటి? అని హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు అనుకుంటుండగా... డ్రైవర్ సీటులో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యక్షం అవుతారు. జర్నీ గోవాకు కాదని చెబుతూ 'ఎఫ్ 4' సినిమాను అనౌన్స్ చేశారు. 


Also Read: 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?


'ఎఫ్ 4' ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనేది ఇప్పుడు చెప్పడం కష్టమే. 'ఎఫ్ 3' రిజల్ట్ చూశాక... 'ఎఫ్ 4' స్క్రిప్ట్ మీద గట్టిగా వర్క్ చేయక తప్పదని దర్శక నిర్మాతలు తెలుసుకుని ఉంటారు. 'ఎఫ్ 3' తర్వాత బాలకృష్ణతో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. సో... 'ఎఫ్ 4' 2023 లేదంటే 2024లో సెట్స్ మీదకు వెళ్లవచ్చు. 


Also Read: Top Gun Maverick Movie Review: 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?