కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి 'కేజీఎఫ్' సినిమాతో పాపులర్ అయింది. ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు జనాలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు కానీ సెకండ్ పార్ట్ తో ఆమె ఇమేజ్ కాస్త పెరిగింది. దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ లాంటి భాషల్లో నటించాలనుకుంటుంది శ్రీనిధి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకి ఛాన్స్ లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారట.
దానికి కారణమేంటంటే.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే. నిజానికి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఇప్పుడు శ్రీనిధి కూడా అదే చేస్తుంది. రీసెంట్ గా ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెని సంప్రదించగా.. దాదాపుగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ప్రస్తుతం తెలుగులో పూజాహెగ్డే, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఆ రేంజ్ మొత్తాన్ని తీసుకుంటున్నారు.
అలాంటిది తెలుగులో ఇంకా ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయని శ్రీనిధి అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. అందుకే ఇప్పటివరకు ఆమె ఒక్క సినిమా కూడా సైన్ చేయలేకపోయింది. ఈ విషయంలో శ్రీనిధి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోందట. మరి అంత పారితోషికం ఇచ్చి ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు ఎవరైనా దొరుకుతారేమో చూడాలి!
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!