పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పట్టించుకోరని అనుకున్నారో లేదంటే ఆయన దృష్టి వరకు తమ వివాదం వెళ్లదని అనుకున్నారో... థియేటర్స్ బంద్ వ్యవహారంలో కొంత మంది వడివడిగా అడుగులు వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏప్రిల్‌లో ఎగ్జిబిటర్లు వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవ మొదలైనప్పటికీ... 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుదల తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఆగలేదు.

పవన్ కళ్యాణ్ సినిమా విడుదలను అడ్డుకోవడం కోసం ఆ నలుగురు కుట్ర చేశారని ప్రచారం మొదలైంది. దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి విచారణకు ఆదేశించారు. ఏకంగా పవన్ కళ్యాణ్ థియేటర్స్ లీజుదారులపై ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్లింది. దాంతో ఇప్పుడు అగ్ర నిర్మాతలు ఒకరి తర్వాత మరొకరు మీడియా ముందుకు వచ్చి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

'ఆ నలుగురి'లో తాను లేనని మెగా నిర్మాత అల్లు అరవింద్ ముందుగా ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్లను బంద్ చేయాలని అనుకోవడం దుస్సాహసం అని ఆయన అన్నారు. మరుసటి రోజు మరో అగ్ర నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. తాను కూడా ఆ నలుగురిలో లేనని క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేది దమ్ము ఎవరికీ ఉందని ఆయన ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఆయన మాటలు గమనిస్తే సురేష్ బాబును కార్నర్ చేసినట్లు కనబడుతోంది. 

సురేష్ బాబు దగ్గర ఎక్కువ థియేటర్లు!నైజాంలో 370 సింగిల్ స్క్రీన్స్ ఉంటే... తమ దగ్గర ఉన్నవి 30 థియేటర్లు అయితే ఏషియన్ సునీల్ అండ్ సురేష్ బాబు కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. మిగతా 250 థియేటర్లు యజమానులు దగ్గర ఉన్నాయని వివరించారు గత 30 ఏళ్లుగా వారంతా తమతో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. 

అల్లు అరవింద్ తన దగ్గర 15 థియేటర్లు మాత్రమే లీజులో ఉన్నాయని, అది కూడా ఏపీలో ఉన్నాయని వాటి లీజు ముగిసిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు వివరించారు తెలంగాణలో అయితే రిప్లై మల్టీప్లెక్స్ తప్ప తమ దగ్గర మరొక థియేటర్ లేదన్నారు. దిల్ రాజు తన దగ్గర ఉన్న థియేటర్ల గురించి చెప్పడం కంటే తనకంటే సురేష్ బాబు ఏషియన్ సునీల్ ఆధీనంలో ఎక్కువ థియేటర్లో ఉన్నాయని వివరించారు ఇక్కడ ఒక విషయం గమనిస్తే... తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గురించి మాత్రమే దిల్ రాజు గట్టిగా చెప్పారు ఉత్తరాంధ్రలో తన దగ్గర 10 థియేటర్లకు మించి లేవన్నట్లు పేర్కొన్నారు.

Also Read: 'ఆ నలుగురు' ఎవరు? అగ్ర నిర్మాతలేనా? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా?? వాళ్ళ చేతుల్లో ఏముంది??

పవన్ కళ్యాణ్ ఏపీకి ఒక ముఖ్యమంత్రి. ఏపీలో సింగిల్ స్క్రీన్స్ ఎన్ని? మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఎన్ని? వాటిలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? అనేది చూడమని అధికారులను ఆదేశించారు. ఇటు అల్లు అరవింద్ గాని, అటు దిల్ రాజు గాని ఏపీలో ఎన్ని సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి? ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి? అనేది వివరించలేదు. దాంతో ఇప్పుడు సురేష్ బాబు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సురేష్ బాబు కలిసి డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాని పట్ల ఆయన స్పందిస్తారా? లేదా? అనేది చూడాలి పవన్ కళ్యాణ్ దెబ్బకు నెక్స్ట్ మీడియా ముందుకు వచ్చేది ఎవరు? అనే ఆసక్తి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులలో కూడా నెలకొంది.

Also Readథియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?