Vikram was not first choice for Dhruva Natchathiram chapter one - Yuddha Kaandam : ప్రతి మెతుకు మీద తినే వ్యక్తి పేరు రాసి ఉంటుందని ఓ సామెత. అదేవిధంగా ప్రతి కథపై ఏ హీరో చేయాలనేది కూడా రాసి పెట్టి ఉంటుందేమో!? ఓ హీరోకి చెప్పిన కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చిత్ర పరిశ్రమలో కొత్త ఏమీ కాదు. గతంలో ఆ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో అలానే కదా ఇద్దరు హీరోలను దాటుకుని మరో హీరో దగ్గరకు వెళ్ళింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
గౌతమ్ మీనన్ కథ రిజెక్ట్ చేసిన సూర్య!
తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్... వీళ్ళిద్దరిదీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా నటించిన 'ఘర్షణ' సినిమా ఉంది కదా! సూర్య నటించిన తమిళ సినిమా 'కాక్క కాక్క'కు అది రీమేక్. దానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు. ఆ సినిమా తమిళనాడు రికార్డులు క్రియేట్ చేసింది. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన రెండో సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే... 'ధ్రువ నక్షత్రం' సినిమా వాళ్ళ హ్యాట్రిక్ అయ్యేది!
అవును... చియాన్ విక్రమ్ కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'ధ్రువ నక్షత్రం'. తొలిత ఈ కథను సూర్యకు చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ తెలిపారు. అయితే స్పై థ్రిల్లర్ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అని సూర్య కొన్ని సందేహాలు వ్యక్తం చేశారని... అందుకే ఆయనతో సినిమా మెటీరియలైజ్ కాలేదని దర్శకుడు వివరించారు.
'ధ్రువ నక్షత్రం' పక్కనపెట్టి 'కబాలి' చేసిన రజనీకాంత్!
సూర్య తర్వాత ధ్రువ నక్షత్రం కథతో సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్ళినట్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలిపారు. అయితే... రజనీకాంత్ వయసును దృష్టిలో పెట్టుకుని హీరో పాత్రలో కొన్ని మార్పులు చేసినట్లు వివరించారు. తనకు కథ నచ్చిందని సూపర్ స్టార్ చెప్పారని... కానీ సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లలేదని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ఆ సమయంలోనే కబాలి సినిమా చేశారని గుర్తు చేసుకున్నారు.
Also Read : శివ కార్తికేయన్ - మురుగుదాస్ సినిమాకు 'జైలర్' టచ్?
సూర్య రజనీకాంత్ రిజెక్ట్ చేసిన కథను విక్రమ్ ఓకే చేశారు. ఆయన హీరోగా సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే చిత్రీకరణ పూర్తి కావడానికి చాలా రోజుల సమయం పట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెలలో సినిమా విడుదలకు సిద్ధమయింది.
నవంబర్ 23న ధ్రువ నక్షత్రం విడుదల
Who is the heroine in Dhruva Natchathiram : ఈనెల 23న ధ్రువ నక్షత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో హైదరాబాద్ ఈ అమ్మాయి రీతు వర్మ కథానాయకగా నటించారు. ఐశ్వర్య రాజేష్ సిమ్రాన్ రాధిక అరుచుందాస్ దివ్యదర్శని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అందించిన హరీష్ జయరాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించారు.
Also Read : 'యానిమల్'కు పోటీగా మాజీ ప్రేయసి భర్త సినిమా - డిసెంబర్ 1న భలే క్లాష్!