Jabardasth Comedian Rocking Rakesh : ‘జబర్దస్త్’ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. మొదట కంటెస్టెంట్ గా చేసిన రాకేష్ ఆ తర్వాత తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగి తన స్కిట్స్ తో ఆడియన్స్ ని నవ్వించాడు. కొన్నాళ్ళు కిరాక్ ఆర్పీతో కలిసి టీం లీడర్ గా స్కిట్స్ చేసిన రాకేష్ ఆ తర్వాత సోలో టీం లీడర్ గా ‘జబర్దస్త్’ లో చేసి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ‘జబర్దస్త్’ లో వచ్చిన పాపులారిటీతో కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇక రీసెంట్ గా హీరోగా మారి ఓ సినిమాను రూపొందించాడు. 'కెసిఆర్' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ తన కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, ‘జబర్దస్త్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


సుజాత నా జీవితంలో సరైన సమయంలో వచ్చింది. 


"ఇండస్ట్రీకి రాకముందు, వచ్చాక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అవమానాలు పడ్డాను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నన్ను ఆదుకోలేదు. కనీసం భుజం తట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. నన్ను సపోర్ట్ చేయలేదని వాళ్ళని తప్పు పట్టను. కాకపోతే ఎవరికి వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సరిపోయేది. ‘జబర్దస్త్’లో రాజకీయాలు, వెన్నుపోట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల ముందు నేను మాట్లాడే అంత క్యాపబిలిటీ నాకు వచ్చిందంటే ‘జబర్దస్త్’ వల్లే. మన ముందు మాట్లాడే వాళ్ళని చూశా, మన వెనుక మాట్లాడుకునే వాళ్ళని చూశా, అన్ని చూశా. కాకపోతే అవేవీ నేను తలకెక్కించుకోలేదు. నా కుటుంబం ఏరోజు నావల్ల ఇబ్బంది పడొద్దు అని అనుకున్నా. ఒకవేళ నన్ను ఎవరైనా తిట్టినా ముందు నా కుటుంబమే కనబడుతుంది. మా ఫ్యామిలీలో మనకెందుకులే అని అనేవాళ్లే తప్ప, నేనున్నానులే పద అనేవాళ్ళు నాకు లేరు. ఆ టైంలో సుజాత నా లైఫ్ లోకి వచ్చింది. కరెక్ట్ టైంకి నా లైఫ్ లోకి వచ్చింది. ఆమె నా లైఫ్ లోకి వచ్చాక చాలా హ్యాపీ. ఇప్పుడు ఏమున్నా నేను తనతో చెప్పుకుంటా" అని అన్నాడు.


సూసైడ్ ఆలోచన వచ్చినప్పుడు రోజా గారు ధైర్యం చెప్పారు


"నన్ను, సుజాతను కలిపింది రోజా గారే. ఈరోజు రాకేష్ కి, నీకు నేనున్నాను అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా అంటే అది రోజా గారు మాత్రమే. ‘జబర్దస్త్’ నుంచి తీసేయడం, అనరాని మాటలు అనడం.. ఆ టైం పీరియడ్లో సూసైడ్ చేసుకోవాలని అనుకున్న నాకు రోజా గారు నాకు ధైర్యం చెప్పారు. రాకేష్ ఓపిక పట్టు, నీకంటూ కచ్చితంగా ఓ రోజు వస్తుంది అని నాకు చెప్పారు. నా రూమ్ లో కూర్చుని ఒక గంట పాటు టైం స్పెండ్ చేశారు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పి కార్ ఇచ్చి నన్ను ఇంటికి పంపించి.. నన్ను ఎంతో మార్చారు. నా పెళ్లి రోజా గారే అంగరంగ వైభవంగా చేయించారు. తిరుపతి కొండమీద సొంత ఖర్చుతో ఎటువంటి ఇబ్బంది రాకుండా నా పెళ్లి ఘనంగా జరిపించారు. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా నా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వచ్చేస్తారు. రోజా గారితో నాకు అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంది. నేను ఎప్పుడూ రోజా గారిని అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తా" అని తెలిపాడు రాకింగ్ రాకేష్.


Also Read : ఇలియానా యాక్టింగ్ నేర్చుకోడానికి 10 నెలలు పట్టింది, కానీ రామ్ అలా కాదు: సీనియర్ నటుడు కామెంట్స్