Senior Actor Bikshu Interview : రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు ఎన్ జె భిక్షు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ఇలియానాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్ జె బిక్షు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చారు. భిక్షు శిక్షణ ఇచ్చిన వారిలో వేణు, జూ. ఎన్టీయార్, నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రామ్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా, దీక్షా సేథ్, సుహాసిని, పార్వతీ మెల్టన్, బెల్లకొండ శ్రీను, నాగ శౌర్య, వంటి నటీనటులు ఉండటం విశేషం.


నా దగ్గర నటన నేర్చుకున్నది వీరే:


తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఇలియానా, రామ్ పోతినేని లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "నేను ఇలియానా, ప్రస్తుతం టీవీ సీరియల్ చేస్తున్న సుహాసిని అనే అమ్మాయి, దీక్ష సేథ్, పార్వతి మెల్టన్, ఆర్య మూవీ హీరోయిన్ ఇంకా పలువురు హీరోయిన్స్ కి శిక్షణ ఇచ్చాను" అని తెలిపారు. ‘‘డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇలియానాను నా దగ్గరికి పంపించారు. అలాగే రామ్ ని రవి కిషోర్ గారు పంపించారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలియానా, రామ్ ఇద్దరికీ ఒకే వయసు ఉండేది. ఇద్దరికీ ఓ 16, 17 ఏళ్ళు ఉండేవి. అలాంటివాళ్లు ఈరోజు నటనలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాకు చాలా తృప్తిగా ఉంది. ముఖ్యంగా ఇలియానా నేషనల్ లెవెల్ లో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ‘బర్ఫీ’ సినిమాలో చాలా బాగా నటించింది. చాలా మంచి అమ్మాయి. రామ్ కూడా నా దగ్గరే ట్రైన్ అయ్యాడు. కానీ ఇవి నేను చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడతాను. నటుడు కావాలంటే సైకలాజికల్ ఎనర్జీ, సహనం, మానసిక శక్తి బాగా ఉండాలి. వీళ్ళు యూత్ కాబట్టి అందరూ జిమ్ కి వెళ్తారు. ఫిజికల్ గా బాగుంటారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నటించాలంటే ఓపిక బాగా ఉండాలి" అని అన్నారు.


ఆమె ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు, నటన నేర్చుకోడానికి 10 నెలలు పట్టింది:


"ఇలియానాకి యాక్టింగ్ నేర్పించడం కష్టం అనిపించింది. ఆ అమ్మాయి మాట్లాడే ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. పోర్చుగీస్, ఫ్రెంచ్ రెండు కలిపి మాట్లాడుతుంది. అది నాకు అర్థమయ్యేది కాదు. నా ఇంగ్లీష్ ఆమెకి అర్థం కాదు. అప్పుడు మా ఆవిడ ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఇలియానాని హ్యాండిల్ చేసింది. అందుకే ఇలియానా యాక్టింగ్ నేర్చుకోవడానికి 9, 10 నెలలు పట్టింది. హీరోలలో పెద్దగా ఇబ్బంది పెట్టింది ఎవరు లేరు, అందరూ చక్కగా నేర్చుకున్నారు" అంటూ బిక్షు చెప్పుకొచ్చారు.


కాగా గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి భిక్షు కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ‘బాల రామాయణం’ సినిమా కోసం పదేళ్ల వయసులోనే ఎన్టీఆర్ తన దగ్గర శిక్షణ తీసుకున్నాడని, ఎన్టీఆర్ బాగా అల్లరి పిల్లాడని, తనతో చాలా మర్యాదగా మాట్లాడతాడని, గురువుగారు అని పిలుస్తాడని వెల్లడించారు. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' మూవీలో తాను కూడా ఓ చిన్న రోల్ చేశానని గత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


Also Read : వెంకటేష్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ - లెజెండరీ క్రికెటర్‌తో వెంకీ మామ సెల్ఫీ వైరల్!