Vishnu Manchu's comedy entertainer Dhee coming to theaters again: విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో 'ఢీ' ఒకటి. మంచు ఫ్యామిలీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరినీ నవ్వించిన చిత్రమిది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

మార్చి 28న థియేటర్లలోకి 'ఢీ''ఢీ' చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 13, 2007...  ఈ సినిమా థియేటర్లలోకి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. టెన్షన్స్ ఉన్నప్పుడు, డిస్టబెన్స్ ఎదురైన సమయాలలో ఈ సినిమా చూసి నవ్వుకునే జనాలు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మార్చి 28న మరోసారి థియేటర్లలో నవ్వించేందుకు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. 

''కల్ట్ క్లాసిక్ సినిమా మళ్లీ వస్తోంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 'ఢీ' థియేటర్లలో గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వబోతుంది. ఈసారి హెచ్.డి.లో కామెడీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చూసి ఎంజాయ్ చేయండి'' అని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.

Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

బ్రహ్మానందం, సునీల్, విష్ణు...ముగ్గురి కామెడీ కేక అంతే!'ఢీ' సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కామెడీ కథానాయకుడు సునీల్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో విష్ణు మంచు కలయికలోని వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నవ్విస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు' అంటూ బ్రహ్మీ చేసిన వినోదాన్ని ఎవరైనా మర్చిపోగలరా!?

విష్ణు మంచు సరసన జెనీలియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో దివంగత నటుడు - కథానాయకుడు శ్రీహరి కీలక పాత్ర పోషించారు. కోన వెంకట్ కథ అందించడంతో పాటు ఆయనతో కలిసి గోపి మోహన్ స్క్రీన్ ప్లే రాసిన ఈ సినిమాకు చక్రీ మ్యూజిక్ చేశారు. ఇటీవల రీ రిలీజ్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సినిమాకు కూడా కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని  ఊహించవచ్చు.

Also Readఆంధ్ర కింగ్ తాలూకా... రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ వింటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా గుర్తుకు వస్తుందా?

'కన్నప్ప' విడుదలకు ముందు...Kannappa Release Date: విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కన్నప్ప'. పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సహా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, లెజెండరీ నటుడు మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్. తెలుగు నాట 'కన్నప్ప' విడుదలకు ముందు 'ఢీ' రీ రిలీజ్ చేయడం హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. విష్ణు సూపర్ హిట్ సినిమాను ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేసినట్లు అవుతుంది.