బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు (Dharmendra Is No More). ఇవాళ ఆయన మరణించారు. ధర్మేంద్ర చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ధర్మేంద్ర మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. తమ అభిమాన నటుడు ఇక లేరని అభిమానులు నమ్మలేకపోతున్నారు. 89 ఏళ్ల ధర్మేంద్ర ఇప్పటికీ నటనలో చురుకుగా ఉన్నారు. ఆయన చివరి సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఆయన తన కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారు.
ధర్మేంద్ర ఆస్తి ఎంత?
ధర్మేంద్ర కష్టపడి కొన్నేళ్ల పాటు సినిమాలు చేశారు. తన ప్రతిభతో పరిశ్రమలో, ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు బాగా ఆడాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం... ధర్మేంద్ర 450 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఆయనకు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. ఆయన తన ఫామ్ హౌస్‌లో నివసించేవారు. అక్కడి నుండి ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు
ధర్మేంద్ర ఫామ్ హౌస్ ఎక్కడుంది?
ధర్మేంద్ర ఫామ్ హౌస్ చాలా అద్భుతంగా ఉందని వీడియోలు చూసిన వాళ్లు ఎవరైనా చెబుతారు. ఖండాలాలోని లోనావాలాలో 100 ఎకరాల్లో ఆయనకు ఫామ్ హౌస్ విస్తరించి ఉంది. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ ధర్మేంద్ర వ్యవసాయం కూడా చేసేవారు. దానిని ఆయన అభిమానులకు చూపిస్తూ ఉండేవారు. ధర్మేంద్ర విలాసవంతమైన ఫామ్ హౌస్ విలువ దాదాపు 120 కోట్లుగా చెబుతున్నారు. ధర్మేంద్ర కుమారుడు బాబీ ఒకసారి మాట్లాడుతూ... ''తన తల్లిదండ్రులు ఫామ్ హౌస్‌లో నివసిస్తున్నార''ని చెప్పారు. ఇంకా బాబీ మాట్లాడుతూ... ''మా నాన్న గారు ఫామ్ హౌస్‌లో ఒంటరిగా ఉంటారని ప్రజలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా అమ్మ ప్రకాష్ కౌర్ కూడా ఆయనతోనే ఉంటారు. వాళ్లిద్దరూ ఖండాలాలో నివసిస్తున్నారు. అమ్మ, నాన్న ఒకరితో ఒకరు ఉన్నారు. అమ్మ, నాన్నలకు ఫామ్ హౌస్‌లో ఉండటం ఇష్టం. ఇప్పుడు వాళ్ళు వృద్ధులయ్యారు. ఫామ్ హౌస్‌లో వారు సౌకర్యంగా భావిస్తారు. అక్కడ వాతావరణం, ఆహారం బాగుంటాయి'' అని చెప్పారు.
Also Read: బాలీవుడ్ హీ మ్యాన్ 'ధర్మేంద్ర' కన్నుమూత - ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
విలాసవంతమైన కార్లంటే ఇష్టం
ధర్మేంద్రకు చాలా విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన సేకరణలో మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ SL500 మరియు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే, ఆయనకు 65 సంవత్సరాల నాటి ఫియట్ అంటే చాలా ఇష్టం.