Balakrishna Special Song In NBK111 Movie : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో హిస్టారికల్ యాక్షన్ డ్రామా రాబోతోన్న సంగతి తెలిసిందే. 'NBK111' వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, హీరోయిన్ నయనతార పవర్ ఫుల్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే భారీ హైప్ క్రియేట్ కాగా... మరో ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది.

Continues below advertisement

స్పెషల్ సాంగ్

బాలయ్య మాస్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుల్ ఎనర్జీ, గ్రేస్ స్టెప్పులు, మాస్ జోష్‌తో డ్యాన్స్ అదరగొడతారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. డిసెంబర్ మూడో వారంలో డైరెక్టర్ గోపీచంద్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా... ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తారో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ వార్త వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Continues below advertisement

Also Read : బికినీ ఫోటో పెట్టాలని అడిగాడు - ఆన్ లైన్ వేధింపులపై బాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్

ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ రాణి పాత్రలో ఆమె నటిస్తుండగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆమె లుక్ ట్రెండ్ అవుతోంది. 'సముద్రాల ప్రశాంతతను తుపానుల ఉగ్రతను మోసే రాణి NBK111 సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తోంది.' అంటూ మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్ హైప్ పదింతలు చేసింది. మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. త్వరలోనే 'NBK111' రెగ్యులర్ షూటింగ్‌లో భాగమవుతారు. గతంలో గోపీచంద్, బాలయ్య కాంబోలో వచ్చిన 'వీర సింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ కానుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.