Dhanush Fuels Fresh Dating Rumours With Mrunal Thakur : కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. మూవీ ఈవెంట్స్, ఇండస్ట్రీకి చెందిన పార్టీల్లో తరచూ ఇద్దరూ కలిసి కనిపించడం, ఫోటోలకు ఫోజులివ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. గతంలోనే దీనిపై మృణాల్ స్ట్రాంగ్‌గా రిప్లై ఇవ్వగా... తాజాగా మరోసారి ఇద్దరూ వార్తల్లో నిలిచారు. 

Continues below advertisement


లవ్ సింబల్‌తో రిప్లై


మృణాల్ ఠాకూర్ రీసెంట్‌గా తాను నటించిన 'దో దివానేే షెహర్ మే' మూవీ టీజర్‌ను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఈ పోస్ట్‌కు ధనుష్ 'టీజర్ చాలా బాగుంది' అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కు మృణాల్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై, కామెంట్స్ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ మళ్లీ చర్చ మొదలైంది. 


కొందరు ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తుండగా... మరికొందరు మాత్రం గతంలోనే మృణాల్ దీనిపై క్లారిటీ ఇచ్చారని... ఇలా రిప్లై ఇచ్చినంత మాత్రాన అలా ఎలా అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మృణాల్ కానీ, ధనుష్ కానీ రియాక్ట్ కావాల్సి ఉంది. 


అయితే, 2 నెలల క్రితం ధనుష్‌తో డేటింగ్ అంటూ రూమర్స్ రాగా హీరోయిన్ మృణాల్ స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చారు. 'నా కెరీర్‌లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటిపై ఫోకస్ చేస్తున్నా. ఏం జరుగుతుంది, ఏం జరగదనే విషయాలు అందరికీ తెలుసు. అందుకే నా జీవితంలో జరిగే వాటి గురించి నిరంతరం ఆలోచించడం, మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు.' అని చెప్పారు. 




Also Read : బికినీ ఫోటో పెట్టాలని అడిగాడు - ఆన్ లైన్ వేధింపులపై బాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్


ఇక సినిమాల విషయానికొస్తే... 'సీతారామం' మూవీలో సీతగా తెలుగింటి అమ్మాయిలా మారారు మృణాల్ ఠాకూర్. ఆమె నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో అడివి శేష్ హీరోగా వస్తోన్న 'డెకాయిట్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అటు, ధనుష్ రీసెంట్‌గా 'ఇడ్లీ కడై'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ మూవీ 'తేరే ఇష్క్ మే' ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో రిలీజ్ చేయనున్నారు. అలాగే, ఇళయరాజా బయోపిక్‌లోనూ నటిస్తున్నారు.