Bollywood Actor Dharmendra Passed Away : బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.

Continues below advertisement

అక్టోబర్ 31న ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో ధర్మేంద్ర చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లామని... ఆరోగ్యం నిలకడగానే ఉందని ధర్మేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని చెప్పారు. అలా చికిత్స పొందుతూ ఆరోగ్య విషమించి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్, బాలీవుడ్ 'హీ మ్యాన్'గా పేరొందారు.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?

Continues below advertisement

కడసారి చూసేందుకు...

ధర్మేంద్ర పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్సులో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు, పొలిటకల్ లీడర్స్ కడసారి చూసేందుకు శ్మశాన వాటికకు తరలివచ్చి నివాళి అర్పించారు. ధర్మేంద్రను గుర్తు చేసుకుంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్. 1935, డిసెంబర్ 8న జన్మించారు. 1954లో ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. 1980లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర - ప్రకాష్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర - హేమమాలినిలకు ఇషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. 1960లో 'దిల్ బీ తేహా హమ్ బీ తేరా'తో కెరీర్ ప్రారంభించిన ఆయన... 'అన్‌పఢ్', 'బందినీ', 'అనుపమ', 'ఆయా సావమ్ జూమ్ కే', 'షోలే', ధర్మ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన చివరి చిత్రం 'ఇక్కీస్'. 

బాలీవుడ్ హీ మ్యాన్

ఇలా దాదాపు 300కు పైగా చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ధర్మేంద్ర బాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. యాక్షన్ కింగ్, బాలీవుడ్ హీ మ్యాన్‌గా పేరొందారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్‌తో సత్కరించి గౌరవించింది.