Director Maruthi Apologise NTR Fans : ప్రభాస్ 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే...
మారుతి కామెంట్స్... ఫ్యాన్స్ ఫైర్
ఆదివారం 'ది రాజా సాబ్' మూవీ నుంచి 'రెబల్ సాబ్' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 'డెఫినిట్‌గా చెబుతున్నా. నేను వారిలా కాలర్ ఎగరేసుకుంటారు అనే మాటలు చెప్పను. అవన్నీ ఈ కటౌట్‌కు చాలా చిన్న మాటలు అయిపోతాయ్. మీ మనుసుల్లోంచి ప్రభాస్ ఎలా వచ్చారో నాకు తెలుసు. ప్రస్తుతానికి ఆ 'రెబల్' యూనివర్సిటీలో చదువుకుంటున్నా. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఫోటో జేబులో పెట్టుకునే పని చేశా. అది జేబులో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అవుతాడు.' అంటూ కామెంట్స్ చేశారు.
అయితే, 'వారిలా కాలర్ ఎగరేయను' అనే కామెంట్‌పై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండగా... మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి సపోర్ట్‌గా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు.
అది నా ఉద్దేశం కాదు
'ఈవెంట్‌లో గురించి పర్సనల్‌గా క్లారిటీ ఇవ్వాలని అనిపించింది. ముందుగా ప్రతీ అభిమానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఎవరినీ బాధ పెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు ఫ్లోలో మనం నిజంగా అర్థం చేసుకునే దానికి డిఫరెంట్‌గా విషయాలు బయటకొస్తాయి. నా కామెంట్స్ తప్పుగా వెళ్లినందుకు నేను చింతిస్తున్నా. ఎన్టీఆర్ పట్ల వారి అభిమానుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది.
సినిమా పట్ల మీ హీరో పట్ల మీరు చూపే ప్రేమకు నిజంగా విలువ ఇస్తున్నా. మీరు పరిస్థితి దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు. మారుతి కామెంట్స్‌తో ఫ్యాన్ వార్ స్టార్ట్ కాగా... ఈ పోస్ట్‌తో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పాలి.
Also Read : హీరో కామెంట్... హీరోయిన్ క్యూట్ రిప్లై - కట్ చేస్తే ధనుష్, మృణాల్ డేటింగ్ రూమర్స్!
ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాబోతోన్న హారర్ కామెడీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు. ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.