పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) మధ్య గొడవ కొత్త మలుపు తీసుకుంది. మొన్నటి వరకు లాయర్ నోటీసులు, సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేయడం వరకు ఉన్నాయి. గొడవ ఎప్పుడు మద్రాస్ హైకోర్టు మెటీరియల్ ఎక్కింది. ఈ ఇష్యూలో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...


మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ధనుష్!
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), నయనతార మధ్య ప్రేమ పుట్టడానికి, అది పెళ్లి పీటల వరకు వెళ్లడానికి కారణం 'నేను రౌడీనే' సినిమా.‌ దాని నిర్మాత ధనుష్. ఆ సినిమా సమయంలో తీసిన వీడియోలో వాడుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC‌ - తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఇచ్చే లేఖ) నయనతార కోరగా... ధనుష్ నో చెప్పారు. మూడు సెకన్ల వీడియో క్లిప్ వాడేందుకు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే... ధనుష్ తీరును ఎండగడుతూ నయనతార పెద్ద లేఖ విడుదల చేశారు. అందులో అతని మీద బోలెడు విమర్శలు చేశారు.


Also Readఅమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు


తండ్రి, అన్నయ్య మద్దతుతో ధనుష్ హీరోగా ఎదిగారని, సినిమా వేడుకల్లో అతను నటిస్తారని, నిజ జీవితంలో ఆ నటనలో సగం నిజాయితీగా కూడా ఉండదని నయనతార విమర్శలు చేశారు. అంతే కాదు... ధనుష్ అనుమతి లేకుండా తన డాక్యుమెంటరీ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్'లో 'నేను రౌడీనే' సినిమా సమయంలో తీసుకున్న వీడియోలు ఉపయోగించారు. దాని మీద ధనుష్, చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. 






నయనతారకు వ్యతిరేకంగా సివిల్ సూట్!
నయనతార ఎన్ని విమర్శలు చేసినా ధనుష్ స్పందించలేదు. మౌనం వహించారు. ఆ తర్వాత చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వాళ్ళు ఇద్దరూ హాజరయ్యారు. అక్కడ ఎడ మొహం, పెడ మొహం కింద ఉన్నారు. ఇప్పుడు ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ ఫిలిమ్స్ మద్రాస్ హైకోర్టులో ఒక సివిల్ సూట్ దాఖలు చేసింది. తమ నిర్మాణ సంస్థ అనుమతి లేకుండా తమ సంస్థలో తీసిన సినిమా వీడియోలు వాడారు అని పేర్కొన్నారు. నయనతార తో పాటు ఆమె భర్త విగ్నేష్ శివన్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్, ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాకు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఈ అంశాలపై నయనతార ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Readసీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?