టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నుంచి నటుడు సుబ్బరాజు (Actor Subbaraju)ను తీసేయాలి. ఇక నుంచి ఆయన బ్యాచిలర్ కాదు. ఓ ఇంటివాడు అయ్యారు. తనకు వివాహం జరిగినట్లు స్వయంగా సుబ్బరాజు తెలిపారు.
అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
సుబ్బరాజు తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'Finally hitched' అని పేర్కొన్నారు. అంటే తనకు పెళ్లి అయినట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే తప్ప... తాను పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఎప్పుడు ఏడు అడుగులు వేశారు? వంటి వివరాలు ఏమి చెప్పలేదు. నటుడు 'వెన్నెల' కిశోర్ సహా కొంత మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.
Subbaraju Wife Details: ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... గత కొన్నాళ్లుగా సుబ్బరాజు ప్రేమలో ఉన్నారు. ఆయనది లవ్ మ్యారేజ్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటే... అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి. ఇండియన్ ఆరిజన్ అయినా సరే... పుట్టింది, పెరిగింది అమెరికాలో అంట! పేరు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? వంటి మిగతా వివరాలు తెలియవలసి ఉంది.
47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
Subbaraju Age: సుబ్బరాజు వయసు తక్కువ ఏం కాదు. ఇప్పుడు ఆయనకు 47 ఏళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మోస్ట్ హ్యాండ్సమ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆయన ఒకరు. ఆయన స్వస్థలం భీమవరం. అసలు పేరు పెన్మత్స సుబ్బరాజు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన 'ఖడ్గం' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అయ్యారు ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలో నటించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Also Read: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
'ఆర్య', 'దేశ ముదురు', 'పౌర్ణమి', 'స్టాలిన్', 'బుజ్జిగాడు', 'ఖలేజా', 'బిల్లా', 'గోల్కొండ హై స్కూల్', 'దూకుడు', 'దేవుడు చేసిన మనుషులు', 'ఎవడు', 'టెంపర్', 'శ్రీమంతుడు', 'దువ్వాడ జగన్నాథం', 'సర్కారు వారి పాట', 'మజిలీ', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. పాన్ ఇండియా హిట్ 'బాహుబలి'లో సైతం అయిన నటించారు. ఇటీవల రాకేష్ వర్రే నటించిన 'జితేందర్ రెడ్డి' సినిమాలో మంచి పాజిటివ్ రోల్ చేశారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా సుబ్బరాజు నటించారు. అయితే ఆయా భాషల్లో ఎక్కువ సినిమాలు చేయలేదు.