‘కార్తికేయ 2’ హిట్ తర్వాత ‘స్వయంభూ’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. హఠాత్తుగా ‘స్పై’ అనే సినిమా రెడీ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నారు. నిర్మాతతో భేదాభ్రియాలు వచ్చాయి. దాంతో కాస్త దూరం జరిగారు. ‘స్పై’ను తెలుగు లోనే విడుదల చేశారు. ఆశించినంత విజయం అందుకోలేదు. హఠాత్తుగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో... దీని కథా కమామీషు ఏమిటో ఎవరికీ తెలీదు. ‘స్వామి రారా ’, ‘కేశవ’, చిత్రాల ఫేమ్ సుధీర్ వర్మ దర్శకుడు. ఎప్పుడు వచ్చిందో తెలియని ఈ సినిమా విడుదలైన 20 రోజులకే స్ట్రీమింగ్ అవుతోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలతో తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
Appudo Ippudo Eppudo OTT Partner: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఆ ఓటీటీలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. నిఖిల్ నటించిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి రేకెత్తించలేదు. థియేటర్లలో రిజల్ట్ బాలేదు. మరి ఓటీటీ ఎటువంటి స్పందన లభిస్తుందో తెలియాలి.
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కథ ఏమిటో తెలుసా?
రేసర్‌గా తనను తాను నిరూపించుకోెవాలన్నది రిషి కల. ఆ గమనంలోనే తార అనే అమ్మాయి తారసపడుతుంది. అతని జీవితంలో ప్రేమను నింపుతుంది. కొన్నాళ్లకే బ్రేకప్ చెప్పడంతో రిషి రేసింగ్ కోసం లండన్ వెళతాడు. అక్కడ తులసి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి మిస్ అవుతుంది. కథ ఓ మిస్టరీ మలుపు తీసుకుంటుంది. అయితే దర్శకుడు కథనాన్ని ముందుకు వెనక్కి అంటూ తిప్పడంతో, హీరో జీవితంలో ఉండే రేసింగ్ ఈ సినిమా కథలో మిస్ అయినట్లయింది. రవితేజ తో ‘రావణాసుర’ చిత్రం తీసి ఫ్లాప్ అందుకున్న దర్శకుడు సుధీర్ వర్మ కు ఈ సినిమా కూడా చేదు ఫలితాన్నే మిగిల్చింది. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు, అజయ్, సత్య, జాన్ విజయ్ కీలక రోల్స్ చేశారు. కార్తీక్, సన్నీ ఎం.ఆర్ స్వరకర్తలు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
పాన్ ఇండియా ఫోకస్