ప్రేక్షకులను మెప్పించాలంటే ప్రతీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సిన అవసరమే లేదు. యాక్షన్స్ సీన్స్, ఫైట్స్ ఉండాల్సిన పని లేదు. మాస్ స్టెప్పులేసే సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీ కాదు. మనసుకు హత్తుకునేలా చాలు. తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా ఈమధ్య బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టించడానికి ఇదే కారణం. అలాంటి సినిమాల్లో ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిత్రంబలం’ కూడా ఒకటి. ఇదే సినిమా తెలుగులో ‘తిరు’ అనే పేరుతో విడుదలయ్యింది. విడుదలయినప్పుడు మాత్రం ఏంటి సినిమా ఇలా ఉంది అనుకున్న ప్రేక్షకులు.. మెల్లగా దీనిని ఫీల్ గుడ్ కేటగిరిలో చేర్చారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యి ఏడాది కావడంతో టీమ్ అంతా కలిసి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ధనుష్, నిత్యా మీనన్‌లు ‘తిరు’ గురించి స్పెషల్ పోస్టులు కూడా పెట్టారు.


కనెక్ట్ అయ్యే పాత్రలు..
మిత్రన్ ఆర్ జవహార్ దర్శకత్వం వహించిన ‘తిరుచిత్రంబలం’ 2022లో ఆగస్ట్ 12న విడుదలయ్యింది. ధనుష్, నిత్యామీనన్ ఇందులో హీరోహీరోయిన్స్‌గా నటించగా.. ప్రకాశ్ రాజ్, భారతీ రాజా లాంటి సీనియర్ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌కు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడు.. సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్‌కు, ఏదో ఒక దగ్గర కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అబ్బాయిలు.. ‘తిరు’ అనే పాత్రకు కాస్త ఎక్కువగానే కనెక్ట్ అవుతారు. ఇక ఈ చిత్రంలో మెరుపుతీగల్లా వచ్చి వెళ్లిపోతారు హీరోయిన్స్ ప్రియా భవానీ శంకర్, రాశీ ఖన్నా. ‘తిరు’లో రాశీ ఖన్నా కనిపించేది కాసేపే అయినా ‘మేఘం కరిగేనే’ అన్న పాటతో సినిమా మొత్తం తనే ఉన్నట్టుగా అనిపిస్తుంది.


‘తిరు’ గురించి ధనుష్ పోస్ట్..
అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ‘తిరు’కు ప్రాణం పోసింది. మామూలుగా ధనుష్, అనిరుధ్ కాంబినేషన్ అంటేనే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లోని పాటలకంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘తిరు’ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఇది మూవీ టీమ్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా ఒక స్పెషల్ సినిమా. అందుకే ‘తిరు’ 1 ఇయర్ యానివర్సికీ అందరూ కలిశారు. ఆ సందర్భంగా ధనుష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. ‘చాలావాటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా, ప్రత్యేకమైన కుటుంబం. దీనిని నేను ప్రతీరోజూ మిస్ అవుతుంటాను. దీనిని మాకు ఎక్స్‌ట్రా స్పెషల్ చేసినందుకు అందరికీ థాంక్యూ. తిరుకు, శోభనకు 1 సంవత్సరం’ అని ధనుష్ మూవీ టీమ్‌తో కలిసిన ఫోటోలను షేర్ చేశాడు.






అంతా మ్యాజిక్..
‘ఈరోజు గురించి చెప్పడానికి మ్యాజిక్ అనే పదం తప్పా ఇంకేమీ రావడం లేదు. కానీ మాలాగా అన్ని విధాలుగా భావాలు కలిసినవారు, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునేవారు కలవడం చాలా అరుదు. ఇదంతా కలిసి ఒక సక్సెస్‌ఫుల్ మూవీలాగా మీ ముందుకు వచ్చినప్పుడు మ్యాజిక్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. తిరుచిత్రంబలం విడుదలయ్యి 1 సంవత్సరం అయ్యింది’ అంటూ నిత్యామీనన్.. తిరు సినిమా గురించి, తన మూవీ టీమ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.






Also Read: ‘లైగర్’తో పోలుస్తూ ‘కింగ్ ఆఫ్ కోథా’పై కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ - దుల్కర్ రెస్పాన్స్ ఇది


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial