New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్

Tamil Cinema Updates On New Year: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ నుంచి సూర్య 'రెట్రో' స్పెషల్ వరకు న్యూ ఇయర్ సందర్భంగా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అప్డేట్స్ అండ్ స్పెషల్ పోస్టర్స్ ఏమిటో చూడండి.

Continues below advertisement

న్యూ ఇయర్ సందడి ప్రజలతో పాటు చిత్ర పరిశ్రమలోనూ కనిపించింది. తెలుగు హీరోలు, దర్శక - నిర్మాతలతో పాటు తమిళ చిత్రసీమ కూడా అప్డేట్స్ ఇచ్చింది. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా కోలీవుడ్ ఇచ్చిన అప్డేట్స్ ఏమిటో చూడండి.

Continues below advertisement

ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్
Dhanush Idli Kadai First Look: 'రాయన్' సినిమాతో దర్శకుడిగానూ ధనుష్ విజయం అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'ఇడ్లీ కడాయ్'. ఇందులో విశాల్ 'పందెం కోడి' ఫేమ్ రాజ్ కిరణ్ కీలక పాత్రధారి. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంతే కాదు... ఏప్రిల్ 10న సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

సూర్య 'రెట్రో' ఫిల్మ్ స్పెషల్ పోస్టర్
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ హీరో సూర్య శివ కుమార్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'రెట్రో'. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి సూర్య స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

సంక్రాంతి బరిలో 'జయం' రవి సినిమా
Kadhalikka Neramillai Release Date: 'జయం' రవి, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా 'కాదలిక్క నీరమిల్లై'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

విజయ్ సేతుపతి... యోగిబాబు... ఏస్!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాల్లో 'ఏస్' ఒకటి. ఫేమస్ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

Also Readమహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?

'7G బృందావన కాలనీ 2' అప్డేట్ కూడా
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన సినిమా '7/జి బృందావన కాలనీ'. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. అదే '7G బృందావన కాలనీ 2'. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరోసారి రవికృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఆయన జోడీగా అనశ్వర రాజన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.


అరుణ్ విజయ్ కథానాయకుడిగా బాల దర్శకత్వం వహించిన 'వనంగాన్' సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. ఆ మూవీ పోస్టర్, మేకింగ్ వీడియోతో పాటు 'కిక్' శ్యామ్ 'అస్త్రం', ఇంకొన్ని సినిమాల స్పెషల్ పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటిని చూడండి.

Also Readక్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్

Continues below advertisement