పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న హిస్టారికల్ సినిమా 'హరిహర వీరమల్లు'. ఇందులో పవన్ ఓ పాట పాడారు. 'మాట వినాలి...' అంటూ సాగే ఆ గీతాన్ని‌ జనవరి 6న ఉదయం 9:06 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.






గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'గేమ్ చేంజర్' ట్రైలర్ జనవరి 2వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.






మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 'డాకు మహారాజ్'లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ 'దిబిడి దిబిడి' చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2న ఆ సాంగ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యూ ఇయర్ గిఫ్ట్ అన్నట్లు ఈ పోస్టర్ విడుదల చేశారు.






రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ యెర్నేని, పి రవి శంకర్ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్. ఆవిడ మహాలక్మి క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.






నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'హిట్ 3'. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 






స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'జాక్- కొంచెం క్రాక్‌', ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' సినిమాలు చేస్తున్నారు. ఆ రెండిటి నుంచి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.










రూపేష్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. పవన్ ప్రభ దర్శకుడు. 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో 'ఏదో ఏ జన్మ లోదో' సాంగ్ కీరవాణి రాశారు. ఆ విషయం చెప్పడంతో పాటు త్వరలో పాట విడుదల చేస్తామని చెప్పారు.







యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమా 'పాంచ్ మినార్'. రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేస్తున్నారు.


Also Readమహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?






ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థల్లో రూపొందుతోంది. శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై రవి శంకర్‌, శేష సింధురావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


Also Readక్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్






అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న 'తండేల్' సినిమాలోని శివ శక్తి సాంగ్ 'నమో నమః శివాయ'ను జనవరి 2వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'బ్రహ్మా ఆనందం'. న్యూ ఇయర్ సందర్భంగా తండ్రీ కొడుకుల స్టిల్ విడుదల చేశారు. ఇంకా విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం', నితిన్ 'రాబిన్ హుడ్', ప్రియదర్శి 'సారంగపాణి జాతకం', అనుపమా పరమేశ్వరన్ 'పరదా', రవికృష్ణ '7/జి బృందావన కాలనీ' సీక్వెల్, ప్రదీప్ మాచిరాజు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', ఫణీంద్ర నర్సెట్టి '8 వసంతాలు'తో పాటు పలు సినిమాల పోస్టర్లు విడుదల అయ్యాయి. అవి ఏమిటో చూడండి.