తెలంగాణ ప్రభుత్వం 'దేవర' సినిమా టికెట్ రేట్ల మీద జీవో విడుదల చేసింది. అయితే... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా టికెట్ రేటు ఎంత పెరుగుతుంది? ఏ స్క్రీన్ అయితే ఎంత రేటు? ఏ రోజు ఎంత రేటు? అనేది జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే...


విడుదల రోజు 29 థియేటర్లలో బెనిఫిట్ షోలు
గురువారం మిడ్ నైట్ నుంచి... అంటే సెప్టెంబర్ 27 (శుక్రవారం) తెల్లవారుజామున ఒంటి గంట నుంచి తెలంగాణలో 'దేవర' బెనిఫిట్ షోలు పడతాయి. టోటల్ 29 థియేటర్లలో 27వ తేదీ ఉదయం 1:00కు షో వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి టికెట్ రేట్ మీద అదనంగా ₹100 పెంచుకోవచ్చు. 


'దేవర' విడుదల తేదీన ఉదయం నాలుగు గంటల నుంచి అన్ని థియేటర్లలో షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ రేటు మీద వంద రూపాయలు అదనంగా పెంచుకోవచ్చు. అప్పుడు టికెట్ రేటు మల్టీపెక్స్‌లలో రూ. 400, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 300 అవుతుంది.  


రెండో రోజు నుంచి తగ్గుతాయి... 50 రూపాయలే!
సెప్టెంబర్ 27న టికెట్ రేటు మీద రూ. 100 పెంచడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం... మర్నాడు (సెప్టెంబర్ 28వ తేదీ) నుంచి కేవలం 50 రూపాయల పెంచడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అదీ మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు మీద 50 రూపాయలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వచ్చేసరికి కేవలం పాతిక రూపాయలు మాత్రమే పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు... తొమ్మిది రోజుల పాటు ఈ జీవో అమల్లో ఉంటుంది. 


Also Read: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!



ఏపీ కంటే తక్కువే పెంచారు కానీ టికెట్ రేటు ఎక్కువే!
మల్టీప్లెక్స్ థియేటర్లలో 'దేవర' టికెట్ రేట్ మీద 135 రూపాయలు పెంచుకోవచ్చు అని ఏపీలో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే అక్కడ మల్టీప్లెక్స్ టికెట్ రేటు 177 రూపాయలే. సో... పెరిగిన రేటు తో కలిపితే 312 రూపాయలు ఉంటుంది. బుక్ మై షో పేటీఎం వంటి యాప్ చార్జీలు కలుపుకున్నా సరే... 350 రూపాయలు దాటదు. కానీ, తెలంగాణలో అలా కాదు. ఇక్కడ చాలా మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో టికెట్ రేటు 300 రూపాయల వరకు ఉంది. కొన్ని స్క్రీన్ లలో రిక్లైనర్ సీట్ రేటు రూ. 350 నుంచి 400 వరకు ఉంది. అప్పుడు దేవర టిక్కెట్ రేటు 500 రూపాయలకు చేరుతుంది. 


Also Readఆస్కార్స్‌కు 'లాపతా లేడీస్' - ప్రభాస్ 'కల్కి', 'యానిమల్'ను కాదని మరీ... అందులో ఏముందో తెలుసా?



ఏపీలో 'దేవర'కు సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు మీద అప్పర్ క్లాస్ 110 రూపాయలు, లోయర్ క్లాస్ 60 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి వచ్చింది.‌ అప్పుడు అటు ఇటుగా 'దేవర' టికెట్ రేటు 200 అవుతుంది. తెలంగాణలోని సింగల్ స్క్రీన్ లలో పలుచోట్ల టికెట్ రేటు 200 రూపాయలు ఉంది. ఇప్పుడు పెరిగిన రేట్ తో 200 పాతిక నుంచి 250 రూపాయల మధ్య ఉంటుంది. సినిమా మీద ఉన్న క్రేజ్... టికెట్ రేట్స్ పెంపు చూస్తుంటే... ఓపెనింగ్ పరంగా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉంది.