Devara Box Office Collection Day 1: 'దేవర'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్నాడు. సినిమా విజయం మీద అటు మూవీ యూనిట్ సభ్యులకు గానీ, ఇటు అభిమానులకు అసలు ఎటువంటి సందేహాలు లేవు. బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించడం ఖాయం అని ఎర్లీ రిపోర్ట్ చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే... ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వస్తాయి? అనేది క్వశ్చన్.


ఏపీ, తెలంగాణలో భారీ ఓపెనింగ్... 65 కోట్లు ప్లస్!
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదనపు ఆటలు వేసుకోవడానికి 'దేవర'కు ప్రభుత్వాలు వెసులుబాటు ఇచ్చాయి. ఆ మేరకు జీవోలు కూడా విడుదల చేశారు. తెలంగాణలో మిడ్ నైట్ ఒంటి గంట నుంచి షోస్ పడుతున్నాయి. టోటల్ 21 థియేటర్లలో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రెగ్యులర్ షోస్ పడుతున్నాయి. అటు ఏపీలోనూ అంతే! రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 65 కోట్లకు పైగా గ్రాస్ రావచ్చని అంచనా.


కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. ఆ మూడు సౌత్ స్టేట్స్ నుంచి అటు ఇటుగా రూ. 10 నుంచి రూ. 15 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ ఇండియా నుంచి రూ. 10 కోట్లు వస్తాయని అంచనా. ఫస్ట్ డే ఇండియాలో 'దేవర' రూ. 85 నుంచి రూ. 90 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.


Also Read: బ్లాక్ బస్టర్ కొడుతున్నాం... 'దేవర'కు సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన రివ్యూ



రికార్డుల దుమ్ము దులిపేలా ఓవర్సీస్ కలెక్షన్!
Devara Collection Day 1: విదేశాల్లో (ఓవర్సీస్ మార్కెట్‌లో) 'దేవర' రికార్డుల దుమ్ము దులిపేలా ఉంది. ఈ సినిమా దూకుడు ప్రీ సేల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి మొదలు అయ్యింది. ఆ జోరుకు... ఆల్రెడీ అక్కడ 2.5 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ రాబట్టింది. మన ఇండియన్ కరెన్సీలు చెప్పాలంటే... 20 కోట్ల కంటే ఎక్కువ. విడుదలకు ఇంకా టైమ్ ఉంది కనుక ఆ కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు ఎలా లేదన్నా ఓవర్సీస్ నుంచి ఇంచు మించు రూ. 30 కోట్లు రావచ్చు. సో... 'దేవర' ఓపెనింగ్ డే సెంచరీ కొట్టడం గ్యారెంటీ. రూ. 100 కోట్ల మీద ఎన్ని కోట్లు ఎక్కువ వస్తాయి? అనేది లెక్క వేసుకోవాలి.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే



ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, కొరటాల శివ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్, జాన్వీ కపూర్ గ్లామర్ కలిపి 'దేవర' మీద ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేశాయి. విడుదలకు ముందు ప్రచార చిత్రాలు క్రేజ్ పెంచాయి. సూపర్ హిట్ టాక్ వస్తే భారీ రికార్డులను ఎన్టీఆర్ క్రియేట్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.