Alia bhatt Jigra Movie Trailer Out: ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ‘మోనికా’, ‘ఓ మై గర్ల్ ఫ్రెండ్’ లాంటి చిత్రాల దర్శకుడు వాసన్ బాలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తమ్ముడి కోసం అక్క పడే ఆవేదన, పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. యాక్షన్ సీన్స్ లో ఆలియా మరో లెవల్ లో నటించింది.


యాక్షన్ సీన్స్ లో మతిపోగొట్టిన ఆలియా


ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. చిన్నప్పుడే పేరెంట్స్ ను కోల్పోయి అక్కా తమ్ముడు అనాథలు అవుతారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. అమ్మానాన్న చనిపోయాక చుట్టాల ఇంట్లో పెరుగుతారు. ఓ అక్రమ కేసులో తమ్ముడు విదేశాల్లో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తాడు. కోర్టు అతడికి ఉరిశిక్ష విధిస్తుంది. తమ్ముడిని ఉరి తీసేందుకు జైలు అధికారులు సిద్ధం అవుతారు. మరోవైపు సోదరుడిని కాపాడుకునేందుకు అక్క చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరకు అక్క తమ్ముడిని కాపాడుకుందా? లేదా? అనే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ప్రస్తుతం ‘జిగ్రా’ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆలియా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.



యాక్షన్ అవతార్ లో అకట్టుకున్న ఆలియా


ఈ సినిమాలో ఆలియా భట్ యాక్షన్ అవతార్ లో ఆకట్టుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ క్యారెక్టర్ తో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ లేని లుక్ లో కనిపించింది. తమ్ముడి కోసం ఆమె చేసే పోరాటం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్ తో నిండిన ట్రైలర్ ‘జిగ్రా’ మూవీపై భారీగా అంచనాలు పెంచుతోంది.  ‘ఆర్చీస్‌’ హీరోగా నటించిన వేదాంగ్ రైనా ఈ సినిమాలో అలియా భ‌ట్ తమ్ముడి నటిస్తున్నారు. టాలీవుడ్ న‌టుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.



దసరా కానుకగా ‘జిగ్రా’ విడుదల


‘జిగ్రా’ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్,  సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఆలియా చివరగా  ‘రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ’ సినిమాలో కనిపించారు. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రణవీర్‌ సింగ్‌ హీరోగా నటించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.



Read Also: వర్షంలో తడవకుండా నడిచే వ్యక్తి గురించి తెలుసా? సస్పెన్స్ థ్రిల్లింగ్‌తో భళా అనిపిస్తున్న ‘కలి’ ట్రైలర్!