దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన 'ఈగ' ఎప్పుడు విడుదల అయ్యిందో గుర్తు ఉందా? జూలై 6, 2012లో! ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే... అందులో సమంత (Samantha Ruth Prabhu) యాక్ట్ చేశారు. ఆ సినిమా విడుదలై ఇప్పటికి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగులో ఆమె అగ్ర కథానాయికగా కంటిన్యూ అవుతున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్, 'యశోద' సినిమాలతో పాన్ ఇండియా స్టార్ట్ అయ్యారు.
'ఈగ' విడుదలైనప్పుడు కాలేజీలో...
ఇప్పుడు సమంతతో హీరోగా!
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'శాకుంతలం' (Shaakuntalam). ఇందులో ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) నటించారు. సమంత కంటే వయసులో అతను చిన్నోడు! కేరళలోని కొచ్చిలో జరిగిన సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఓ విషయంలో అతను నిజం చెప్పేశారు.
'ఈగ' విడుదల అయినప్పుడు తాను కాలేజీలో ఉన్నానని, అప్పుడు థియేటర్లలో సమంతను చూశానని దేవ్ మోహన్ చెప్పారు. పక్కన కూర్చున్న సమంత ఏం చెప్పారో? ఏమో? ఏ వయసులో అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఆ తర్వాత తాను ఓ కంపెనీలో పని చేసేటప్పుడు... దానికి సమంత బ్రాండ్ అంబాసిడర్ అని, యాడ్ చేయడానికి వచ్చిన ఆమెను నేరుగా చూశానని దేవ్ మోహన్ తెలిపారు. కట్ చేస్తే... ఇప్పుడు సమంతతో ఆయన సినిమా చేశారు. ఒక విధంగా ఆయనకు ఇది అఛీవ్‌మెంట్ కదా!
సమంత కంటే ఐదేళ్లు చిన్న!
Samantha Dev Mohan Age Difference : నటుడిగా సమంత కంటే దేవ్ మోహన్ చాలా జూనియర్. వయసు పరంగానూ ఆమె కంటే చిన్నోడు. ఇప్పుడు సమంత వయసు 35 ఏళ్ళు కాగా... అతడి వయసు 30 ఏళ్ళు. ఫిట్నెస్ అంటే సమంత ప్రాణం పెడతారు. జిమ్ బంక్ కొట్టడం అనేది ఉండదు. అందువల్ల, ఆమె వయసు పెద్దగా కనిపించదు. స్క్రీన్ మీద ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది.
Also Read : టాలీవుడ్‌లో విషాదం - నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి
'శాకుంతలం' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. సుమారు నెల ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసేశారు. ఆల్రెడీ ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యింది. గుణశేఖర్, నిర్మాతలు 'దిల్' రాజు, నీలిమా గుణతో కలిసి కలిసి సమంత సినిమా చూశారు. రివ్యూ కూడా ఇచ్చారు.
దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'మల్లికా.... మల్లిక', 'ఏలేలో ఏలేలో...', 'ఋషి వనములోన...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : అమ్మది అలెప్పీ అయినా... కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్