Kalki 2898 AD Pre Booking Sales: ఒక సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో తెలుసుకోవాలంటే దాని ప్రీ బుకింగ్స్ చూస్తే చాలు అనే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం ప్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ ప్రీ బుకింగ్స్ చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఏ రేంజ్‌లో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారో తెలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ విషయంలో ‘కల్కి 2898 AD’ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. హిందీలో సైతం ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడంతో సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 27న విడుదల కానుంది.


మాస్ ఆడియన్స్..


‘కల్కి 2898 AD’ హిందీ వర్షన్‌కు సంబంధించి ప్రీ బుకింగ్స్ వివరాలు బయటికొచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద థియేటర్ ఫ్రాంచైజ్‌లు అయిన పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్‌లో మొత్తంగా 37 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. మూవీ రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు ఈ ప్రీ బుకింగ్ హడావిడి కొనసాగేలా ఉంది. బుధవారం పూర్తయ్యేలోపు కేవలం హిందీ వర్షన్‌లోనే 1.35 లక్షల టికెట్లు బుక్ అవ్వనున్నట్టు ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ పోస్టర్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయినా కూడా మాస్ ఆడియన్స్‌లో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆ క్రెడిట్ పూర్తిగా ప్రభాస్‌దే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.


సింగిల్ స్క్రీన్‌లో కూడా..


ఇండియాలోని మరో పాపులర్ థియేటర్ ఫ్రాంచైజ్ అయిన మూవీమ్యాక్స్ కూడా ఇప్పటికే ‘కల్కి 2898 AD’కి సంబంధించి 1400 టికెట్లను సేల్ చేసింది. ‘సలార్’ మూవీ విషయంలో కూడా మొత్తంగా 2700 టికెట్లను అమ్మింది మూవీమ్యాక్స్. ఇప్పుడు ‘కల్కి 2898 AD’.. ఆ నెంబర్‌ను దాటేసేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగులో మాత్రం మూవీమ్యాక్స్ 2400 టికెట్లను అమ్మడం విశేషం. ఆఖరికి బిహార్‌లోని ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో కూడా 24 గంటలలోపే 500 టికెట్లు అమ్ముడుపోయాయంటే ‘కల్కి 2898 AD’ రేంజ్ ఏంటో తెలుస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ విషయానికొస్తే.. ‘కల్కి 2898 AD’ ఫస్ట్ డే కోసం ఇప్పటికే 75 వేల టికెట్లను అమ్మింది.


ఆ రాష్ట్రాల్లో స్లో..


తెలుగు, హిందీ రేంజ్‌లో తమిళంలో ‘కల్కి 2898 AD’ ప్రీ బుకింగ్స్ కనిపించడం లేదు. ఇప్పటికే పలు థియేటర్లలో 1000 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. రిలీజ్‌కు ఒకరోజు ముందు కచ్చితంగా ఈ నెంబర్ పెరుగుతుందని నిపుణులు అనుకుంటున్నారు. వీటన్నింటిని చూస్తుంటే ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ అనేవి మొదటిరోజే రూ.110 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక కర్ణాటక, తమిళనాడులో కూడా మూవీకి బుకింగ్స్ పెరిగితే ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తే.. ‘కల్కి 2898 AD’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Also Read: ‘కల్కి 2898 AD’ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?