Baby Vs Bro : సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'బేబీ' యూత్ ఆడియన్స్‌కి బాగా నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. మూడో వారంలోకి అడుగుపెట్టినా ఆ క్రేజ్ తగ్గలేదు. జూలై 27న కూడా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ తరహా సక్సెస్ రావడం బేబీకే దక్కిందని చెప్పింది.


థియేటర్లలో ఒక సినిమా ఇంత నిలకడగా రన్ అవుతుంటే, సాధారణంగా థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లలో సినిమాను ఎక్కువ రోజులు కొనసాగించడానికే ఇష్టపడతారు. అయితే, 'బేబీ' మూవీ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. మెగా ఫ్యామిలీపై వారికి ఉన్న ఇష్టం కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. బేబీ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN మెగా ఫ్యామిలీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్. అందుకే వారు శుక్రవారం విడుదలైన ‘బ్రో’ మూవీకి మద్దతుగా.. ‘బేబీ’ షోస్‌ను ప్రదర్శిస్తున్న థియేటర్లను ‘బ్రో’కు ఇచ్చేసినట్లు సమాచారం.


Read Also : Kriti Sanon: 'ఆదిపురుష్' హీరోయిన్ సరికొత్త వ్యాపారం - ఆమె ప్రొడక్ట్స్ రేట్ ఎంతో తెలుసా?


ప్రస్తుతం 'బేబీ' మూవీ ఎక్కువ థియేటర్లలోనే రన్ అవుతోంది. అయితే ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న 'బ్రో' కోసం 'బేబీ' మేకర్స్.. కొన్ని థియేటర్స్ ను వదిలేసుకున్నారనేది టాక్. వారికి మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానంతోనే ఇలా చేశారని అంటున్నారు. తమ సినిమా మరింత సక్సెస్ ను అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందరికంటే తమ సినిమానే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని, ఎక్కువ రోజులు ఆడాలని ఆశిస్తూంటారు. కానీ సాయి రాజేష్, SKN మాత్రం తమ అభిమానాన్ని ఇలా చాటారని అంటున్నారు.


ఇక 'బ్రో' విషయానికొస్తే.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కూడా కీలక పాత్రలు పోషించారు. ZEE స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచనను నిర్వహించగా, సముద్రఖని దర్శకుడిగా వ్యవహరించారు.


మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటేనే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటిది మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా అంటే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ప్రస్తుతం ‘బ్రో’ సినిమాకు అలాంటి క్రేజే ఉంది. ఒకవైపు బయట వర్షం పడుతున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు తగ్గడం లేదు. థియేటర్లకు క్యూ కడుతున్నారు. అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు మొదలైపోయాయి. అయితే, అభిమానుల సంబరాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ఓవర్‌సీస్ నుంచి టాక్ వస్తోంది.


Read Also : Bro Audience review - ‘బ్రో’ ప్రేక్షకుల రివ్యూ: ఆ చివరి 20 నిమిషాలు చాలట - ఈ మూవీ ఫ్యాన్స్ కోసమా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial