Daaku Mahaaraj Box Office Collection Day 2 : డాకు మహారాజ్‌గా వచ్చి.. సంక్రాంతి 2025కి తన సత్తా చూపాడు బాలయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న విడుదలై హిట్ టాక్ని అందుకుంది. సంక్రాంతి రేస్‌లో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ని అందుకుని ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. స్టోరి రొటీన్ అయినా.. దానికి ప్రేక్షకులకు కావాల్సినవిధంగా కమర్షియల్ ఎలిమినెంట్స్ను జోడించి ఫెస్టివల్ ఫీస్ట్‌గా విడుదల చేసింది చిత్రబృందం.
బాలయ్య వైల్డ్ యాక్షన్ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం.. రెండో రోజు కూడా తన సత్తా చాటింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు కలెక్ట్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 22.31 కోట్లు కొల్లగొట్టింది. మరి రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే..
రెండో రోజు కలెక్షన్స్ ఇవే
తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ రెండో రోజు కూడా ఊహించని వసూళ్లు సాధించింది. నిజాంలో 2.44 కోట్లు, సీడెడ్‌లో 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.26 కోట్లు, గుంటూరులో 0.74 కోట్లు, కృష్ణలో 0.72 కోట్లు, తూర్పు గోదావరిలో 0.79 కోట్లు, పశ్చిమ గోదావరి 0.46 కోట్లు, నెల్లూరు 0.38 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా రెండో రోజు డాకు మహారాజు తెలుగు రాష్ట్రాల్లో 8.51 కోట్లు వసూలు చేశాడు బాలయ్య.
డాకు మహారాజ్ సినిమాను యాక్షన్ డ్రామాగా రూపొందించి.. దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు డైరక్టర్. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించగా.. ఊర్వశి రౌతేలా స్పెషల్ పాత్ర చేసింది. ఓ సాంగ్‌లో కూడా ఆమె నటించి మెప్పించింది. తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. బాలయ్య, తమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా కూడా హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా వీరు అదే జోరును కొనసాగించారు.
సంక్రాంతి స్పెషల్ సినిమాలు
టాలీవుడ్లో సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన మూడు ప్రధాన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ని సంపాదించుకున్నాయి. ముందుగా వచ్చిన గేమ్ ఛేంజర్ మిక్డ్స్ టాక్ని తెచ్చుకుంది. అయినా సరే మంచి కలెక్షన్స్‌ని రాబడుతూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే డాకు మహారాజ్ కూడా పాజిటివ్ టాక్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో వెంకీ మామ కూడా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాడు. టీఎఫ్ఐ కట్టుబానిసలకు ఈ సంక్రాంతి మంచి సినిమాలనే అందించిందంటూ టాక్ నడుస్తుంది.