మెగా ఫ్యామిలీ మీద ఛాన్స్ దొరికిన ప్రతిసారి సెటైర్లు వేసే వ్యక్తులలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ముందు ఉంటారు.‌ ఏపీలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మీద విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో పాటు లోకేష్, పవన్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సెటైరికల్ సినిమాలు తీశారు. వైసీపీ అండతో ఆయా సినిమాలు చేశారని విమర్శలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కించపరిచే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉన్న వర్మ మరోసారి జూలు విదిలించి తన మార్క్ ట్వీట్లతో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మీద విరుచుకుపడ్డారు. 

'గేమ్ చేంజర్' బడ్జెట్, కలెక్షన్స్ మీద వర్మ విమర్శలు!'గేమ్ చేంజర్' పేరును తన ట్వీట్లలో రామ్ గోపాల్ వర్మ తీయలేదు. 'G C' అని చెప్పారు. అంటే... 'గేమ్ చేంజర్' అన్నమాట. ఆ సినిమా బడ్జెట్ 450 కోట్ల రూపాయలు అయితే... ఇంతకు ముందు ఎప్పుడూ ప్రేక్షకులు చూడనటువంటి ఎక్స్ట్రార్డినరీ విజువల్ అప్పీల్ ఉన్న 'త్రిబుల్ ఆర్' సినిమా బడ్జెట్ 4500 కోట్ల రూపాయలు అయ్యి ఉండాలని వర్మ పేర్కొన్నారు. అంతే కాదు... 'గేమ్ చేంజర్' మొదటి రోజు 186 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అయితే పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్లు 1860 కోట్ల రూపాయలు అయ్యి ఉండాలని ఆయన విమర్శలు గుప్పించారు. నిజం చెప్పినప్పుడు నమ్మేలా ఉండాలని 'గేమ్ చేంజర్' విషయానికి వస్తే అబద్ధం చెప్పినప్పుడు మరింత నమ్మశక్యంగా ఉండాలని వర్మ ట్వీట్ చేశారు.

Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?

రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు తెలుగు సినిమాను రియల్ కలెక్షన్లతో ఆకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లడంతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేస్తే... సౌత్ ఇండస్ట్రీ ఫ్రాడ్ చేయడంలో ఫెంటాస్టిక్ అంటూ చెప్పడంలో 'గేమ్ చేంజర్' వెనుక ఉన్న జనాలు సక్సెస్ అయ్యారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ అబద్ధాలు చెబుతున్నది ఎవరో తనకు తెలియదని, 'దిల్' రాజు అయితే కాదని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. తనకు 'పుష్ప 2' సినిమా నచ్చిందని, అయితే 'గేమ్ చేంజర్' చూశాక అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ళ మీద పడాలని అనిపించిందని వర్మ ముగించారు.

Also Readనవ్వించే ప్రయత్నమే... మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు - అన్షుపై కామెంట్స్‌ & రేవంత్ రెడ్డి - బన్నీ ఇష్యూలో సారీ చెప్పిన త్రినాథరావు నక్కిన