స్వాతి రెడ్డి (Swathi Reddy)... ఫోటో చూపించకుండా ఈ పేరు చెబితే ప్రేక్షకులు గుర్తు పట్టడం కొంచెం కష్టమే! ఒకవేళ 'కలర్స్' స్వాతి అని చెబితే ఠక్కుమని గుర్తు పడతారు. స్వాతి పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగు బుల్లితెరపై ఆమె ఎంత ఫేమస్ అయ్యారంటే... టాక్ షో 'కలర్స్' పేరు ఆమె ఇంటి పేరు అయ్యింది. ఆ కార్యక్రమం ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కథానాయికగా అవకాశాలను కూడా తెచ్చింది. వెండితెరపైనా స్వాతి సత్తా చాటారు. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లారు. ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే... ఆమె వైవాహిక జీవితం గురించి ఓ పుకారు షికారు చేస్తోంది. 


విడాకులు తీసుకున్న 'కలర్స్' స్వాతి!?
'కలర్స్' స్వాతి వివాహం 2018లో జరిగింది. వికాస్ వాసుతో ఆమె ఏడు అడుగులు వేశారు. సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను కలర్స్ స్వాతి ఎప్పుడూ చెప్పింది లేదు. వివాహమైన తర్వాత విదేశాలు వెళ్ళాక... రెండు మూడుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే... భర్త నుంచి స్వాతి విడాకులు తీసుకున్నారని, అందువల్ల మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


'కలర్స్' స్వాతి ప్రధాన పాత్రలో గత ఏడాది 'పంచతంత్రం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది 'మంత్ ఆఫ్ మధు' విడుదల కానుంది. ఆ సినిమాలో నవీన్ చంద్రకు జోడీగా ఆమె నటించారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమంలో విడాకులకు సంబంధించిన ప్రశ్న స్వాతికి ఎదురైంది. 


''ఈ కార్యక్రమానికి, ఆ ప్రశ్నకు సంబంధం లేదు. అనవసరం అని నా అభిప్రాయం. నేను సమాధానం చెప్పను'' అని స్వాతి స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆన్సర్ వైరల్ అవుతోంది. ప్రశ్న అడిగిన విలేకరిపై కొందరు విమర్శలు చేస్తున్నారు కూడా! ఆ విధంగా అడగటం సభ్యత కాదని ఆయనకు హితవు పలుకుతున్నారు.


Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
 
అక్టోబర్ 6న 'మంత్ ఆఫ్ మధు' విడుదల
నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన 'మంత్ ఆఫ్ మధు' సినిమాలో శ్రేయ నవేలి, హర్ష చెముడు, మంజుల ఘట్టమనేని ముఖ్య తారాగణం. అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు నవీన్ చంద్రతో ఆయన 'భానుమతి రామకృష్ణ' సినిమా తీశారు. 


Also Read మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?



జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ తదితరులు నటించిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రానికి రచన & దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి, నిర్మాత : యశ్వంత్ ములుకుట్ల, సహ నిర్మాత: సుమంత్ దామ, ఛాయాగ్రహణం : రాజీవ్ ధరావత్, సంగీతం : అచ్చు రాజమణి, ఎడిటర్ : కూర్పు : రవికాంత్  పెరేపు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial