Chota K Naidu Reveals Issue With Director Harish Shankar : టాలీవుడ్ లోని సీనియర్ కెమెరామెన్లలో ఒకరు చోటా కే నాయుడు. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఆయనది. ఎంతోమంది డైరెక్టర్లతో పనిచేశారు. అయితే, తనకు కోపం చాలా ఎక్కువ అని, రగిలిపోతానని చెప్తున్నారు. ఆ కోపం కూడా ఎక్కువ సేపు ఉండదని అంటున్నారు. ఒక్కోసారి డైరెక్టర్లు వాళ్లు చెప్పినట్లు మాత్రమే వినాలని అంటారని, అలాంటప్పుడు వాళ్లకే వదిలేస్తానని అంటున్నారు. ఇలా తన అనుభవాలను పంచుకున్నారు చోటా. ఈ సందర్భంగా హీరశ్ శంకర్ తో ఇష్యూపై కూడా స్పందించారు.
కోపం చాలా ఎక్కువ...
వర్క్ విషయంలో ఎప్పుడైనా డిస్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యారా? ఏంటిరా వీడు అని ఎవరైనా అనిపించారా? అని అడిగిన ప్రశ్నకి చోటా ఇటా సమాధానం ఇచ్చారు. "అలాంటివి వస్తూనే ఉంటాయి. ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటాను. ఇలా కాపోతే ఇలాగా లేకపోతే అలాగా అని నాకు నేను చెప్పుకుంటాను. హరీశ్ శంకర్.. డైరెక్టర్ గా ఉన్నప్పుడు 'రామయ్య వస్తావయ్యా' చేశాను. అస్తమానం అడ్డుపడేవాడు. అతడి స్క్రిప్ట్ పనిలో అతడు ఉండేవాడు. అది కాదు అన్న, ఇది కాదు అన్న అనేవాడు. చెప్పేందుకు చాలా ట్రై చేశాను. వినలేదు. సో వదిలేశాను. రెండు ఉంటాయి నా దగ్గర. మ్యాగ్జిమమ్ కన్విన్స్ చేస్తాను. కన్విన్స్ అయితే ఓకే.. అలా కాకపోతే వాళ్లకు ఏం కావాలో అదే చేస్తాను. దాంట్లో కూడా దీ బెస్ట్ ఇస్తాను. నాకు భగవంతుడు ఇచ్చిందేంటంటే కోపం వస్తుంది కానీ, ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. తర్వాత వెంటనే వాళ్లు కరెక్ట్ అయ్యిండొచ్చు కదా. ఓకే చూద్దాం అని అనుకుంటాను. లక్కీగా ఏంటంటే ఒక వేళ మా డైరెక్టర్లు నాతో ఏదైనా రాంగ్ పనిచేయించినా తర్వాత ఎండ్ ఆఫ్ దే వాళ్లు రియలైజ్ అవుతారు. కోపం వచ్చినప్పుడల్లా ఒక నిమిషం బర్న్ అవ్వడం లేదా మా వాళ్లు నన్ను కన్విన్స్ చేయడం లాంటివి జరుగుతాయి" అని తన షూటింగ్ విశేషాలు చెప్పారు చోటా కే నాయుడు.
డైరెక్టర్ తో ఛీ కొట్టించాను
"'పుకారు' సినిమా చేస్తున్నాను. కాశ్మీర్ లో షూట్. చెక్ పోస్ట్ దగ్గర మిలటరీ ట్రక్స్ అలా వస్తూ ఉంటాయి. ట్రక్స్ వస్తుంటే అలా వచ్చి ఆగినట్లు షూట్ చేయాలి. ముందు రోజు వెళ్లి సెట్ దగ్గర చూశాం. అక్కడే కొన్ని కరెక్షన్స్ అవి చెప్పి డైరెక్టర్ ని కొన్ని విషయాల్లో కన్విన్స్ చేశాను. అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పుడు డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి మంచి ఫామ్ లో ఉన్నాడు. షాట్ ఇలా ఉంటుంది, ఇలా చేద్దాం అని మార్పులు చెప్పా. కన్విన్స్ అయ్యాడు. అప్పుడు టినూ ఆనంద్ ఆ సినిమా ఫైట్ మాస్టర్. అతను వచ్చి క్రేన్ ఎక్కి కూర్చున్నాడు. రిహార్సల్ షాట్ అన్నాడు. అయ్యింది.. టేక్ అన్నాడు కానీ కెమెరా దిగడం లేదు. నాకు రగిలి పోతుంది. ఫస్ట్ డే అక్కడ గొడవ పెట్టుకోలేను. నేను కదా కెమెరామెన్ అనిపించింది. అప్పుడు నెక్ట్ షాట్ లో డైరెక్టర్ తోనే వాడిని ఛీ అనిపించాను. కెమెరా క్రేన్ దిగేలా చేశాను" అని కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు చోటా కే. నాయుడు.
Also Read: బాల్యంలో విలాసవంతమైన జీవితం గడపలేదు, రోజూ 6 గంటలే నిద్ర: సమంత