Shekar Master Latest Interview : టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢీ షోతో కెరీర్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి తన టాలెంట్ తో అదే ఢీ షోకి జడ్జిగా వ్యవహరించే స్టేజికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు. ఓ వైపు సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢీ షోతో పాటూ ఇటీవల పలు కామెడీ షోలకి కూడా జడ్జిగా పనిచేశారు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘స్టార్ మా’లో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ఏకంగా ముద్దు పెట్టింది. ఇదే విషయమై శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శ్రీముఖి ముద్దు పెట్టడంపై శేఖర్ మాస్టర్ రియాక్షన్
"నేను ఫస్ట్ ఢీ షోకి వెళ్ళినప్పుడు శేఖర్ మాస్టర్‌కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చాలామంది చెప్పేవారట. దాన్ని శేఖర్ మాస్టర్‌కు లేడీస్ అంటే ఇష్టం అన్నట్లుగా మార్చేశారు. అలా ఎప్పుడైనా రష్మీ, అనసూయ లాంటి వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటే అందరూ 'అ.. ఆ..' అని ఆటపట్టించేవారు. అలాగే రోజా గారంటే నాకిష్టం.. ఆమెతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా అలా అనడం.. మొన్న స్టేజి మీద శ్రీముఖికి ఏమనిపించిందో ఏమో సాంగ్ వచ్చిందని చెప్పి ఉమ్మా.. ఉమ్మా.. అని ముద్దు పెట్టింది. దాని గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వేశారు. ఆమె ముద్దు పెట్టినదానికి నేనేం చేస్తా చెప్పండి. అదేదో అలా సరదాగా జరిగింది" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
హీరోగా చాలామంది అడిగారు
" టీవీల్లో కనపడే వాళ్ళకి కచ్చితంగా అలాంటి ఛాన్స్ వస్తుంది అలా అని నేనేదో సూపర్ ఉన్నాను, నావల్ల వచ్చిందని అనుకోవడం నాకు తెలిసి అది తప్పు. నన్ను కూడా హీరోగా చాలామంది అడిగారు. కానీ మన జాబ్ అదికాదు. నా గురించి నాకు తెలుసు నేను ఎంతవరకు చేస్తానో. నేను హ్యాపీగా కొరియోగ్రఫీ చేసుకుంటాను. హీరో తప్పా వేరే దానికి వెళ్లొచ్చు. డైరెక్షన్ సైడ్ వెళ్లే స్కోప్ ఉండొచ్చు. కానీ హీరో అనేది కంప్లీట్ డిఫరెంట్ నేను దానికి సెట్ కాను" అని అన్నారు.
స్కిట్స్ లో డబుల్ మీనింగ్ అనిపిస్తే చెప్తాం
డ్యాన్స్ షోస్ కి వచ్చేసరికి డాన్సుల్లో డబుల్ మీనింగ్ ఏమి ఉండదు. డాన్స్ అంటే ఓన్లీ డాన్స్ మాత్రమే ఉంటుంది. డాన్స్ బాగుంటే కరెక్ట్ గా జడ్జ్ చేస్తాం. కామెడీ స్కిట్స్ విషయానికొస్తే.. స్కిట్స్ లో ఏదో చిన్న మసాలా ఉంటేనే కామెడీ పండుతుందని వాళ్ళు అలా చేస్తారు. అలా ఏదైనా అనిపిస్తే మేము చెప్తాం అది ఆఫ్ ద రికార్డు చెప్తాం. కానీ డైరెక్ట్ గా చెప్పం. నేను ఉన్నంతవరకైతే మరీ డబుల్ మీనింగ్ అని అనిపించలేదు. ఒకవేళ అనిపిస్తే కచ్చితంగా ఆఫ్ ద రికార్డు చెప్తాం" అంటూ తెలిపారు.
Also Read : వామ్మో, బంగారం కేకును కట్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ బ్యూటీ - దాని విలువ అన్ని కోట్లా?