చియాన్ విక్రమ్ ఆరోగ్యంగా ఉన్నారని, ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఛాతిలో నొప్పిగా అనిపించడంతో శుక్రవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో విక్రమ్ చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండెపోటు అని ప్రచారం జరగ్గా... కుమారుడు ధృవ్ విక్రమ్, మేనేజర్ సూర్యనారాయణ ఖండించారు. తాజా సమాచారం ఏంటంటే... రెండు రోజుల్లో విక్రమ్ మీడియా ముందుకు రానున్నారు.
Vikram To Attend Cobra Movie Pre Release Event To Be Held On July 11th: విక్రమ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా'. ఇందులో 'కెజియఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఈ నెల 11న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి విక్రమ్ హాజరు అవుతారని చిత్ర బృందం వెల్లడించింది. సో... మీడియా ముందుకు చియాన్ రావడం కన్ఫర్మ్ అన్నమాట.
Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?
తన హెల్త్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరిగిన నేపథ్యంలో 'కోబ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్రమ్ మాట్లాడతారా? లేదా? అనేది చూడాలి. 'కోబ్రా'కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?