చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన తారలుగా రూపొందుతోన్న దృశ్యకావ్యం 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan 1 Movie). ప్రముఖ దర్శకులు మణిరత్నం  తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు ఇతర ప్రధాన తారాగణం. ఈ రోజు సినిమా (PS1 Movie) టీజర్ విడుదల చేశారు. తెలుగు వెర్షన్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.



'పొన్నియన్ సెల్వన్' టీజర్ చూస్తే... ప్రతి ఫ్రేములో రాజసం తొణికిసలాడింది. కొన్ని రోజుల నుంచి ప్రధాన తారాగణం లుక్స్ విడుదల చేస్తూ... మణిరత్నం అంచనాలు పెంచారు. ఆల్రెడీ లుక్స్ చూసిన ప్రేక్షకులకు టీజర్‌లో విజువల్స్ కనులవిందు కలిగించాయి. రాజులు, రాజ్యాలు నేపథ్యంలో మణిరత్నం ఒక దృశ్యకావ్యం తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.


'ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం... అంతా దాన్ని మర్చిపోవడానికే! ఆమెను మర్చిపోవడానికి, నన్ను నేనే మర్చిపోవడానికి' అని విక్రమ్ చెప్పిన డైలాగ్ ఒక్కటే టీజ‌ర్‌లో ఉంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 






మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.


Also Read : విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ రాలేదు - క్లారిటీ ఇచ్చిన మేనేజర్, ఇప్పుడు హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే?


Ponniyin Selvan Teaser Leaked: 'పొన్నియన్ సెల్వన్' టీజర్ అఫీషియల్‌గా విడుదల చేయడానికి కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.  టీవీలో ప్లే అయిన టీజర్‌ను చాలా మంది ట్వీట్లు చేశారు. నెట్టింట ఈ టీజర్ హాట్ టాపిక్ అయ్యింది. 


Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?