Chiranjeevi Wife Surekha Gift pen to Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌ విక్టరితో మెగా ఫ్యామిలీలో ఆనందంలో మునిగితేలుతుంది. పిఠాపురం నుంచి గెలిచి ఇంటికి వచ్చిన తమ్ముడి మెగాస్టర్‌ చిరంజీవి, మెగా ఫ్యామిలీ గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది. అంతేకాదు పవన్‌తో కేక్‌ కట్‌ చేయించి విన్నింగ్‌ని సెలబ్రేట్‌ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తమ్ముడికి చిరు భారీ మాలతో స్వాగతం పలికాడు. తమ్ముడికి ఆప్యాయంగా హత్తుకుని ముద్దుపెట్టిన ఈ వీడియో ప్రతిఒక్కరిని భావోద్వేగానికి గురి చేసింది.


ఇక ఈ మెగా బ్రదర్స్‌ మధ్య ఉన్న అప్యాయత, ప్రేమానురాగాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఏకంగా ప్రధాని మోదీనే ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో పవన్‌ కళ్యాణ్‌ తన తల్లి అంజనమ్మకు, వదిన సురేఖ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యం ప్రతి ఒక్కరిని హత్తుకుంది. అలా పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల్లో గెలిచిన అనంతరం నుంచి మెగా ఫ్యామిలి వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా చిరంజీవి ఓ ప్రత్యేకమైన వీడియో షేర్‌ చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్‌కు ఆయన వదిన, మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. 


ఈ సందర్భంగా చిరు ఇంటికి పవన్‌, ఆయన సతీమని అన్నా లెజినోవా వెళ్లిన వీడియోను చిరంజీవి షేర్‌ చేశారు. తన పోస్ట్‌కి 'కళ్యాణ్‌ బాబుకు వదినమ్మ బహుమతి' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోలో సురేఖ పవన్‌కు ఖరీదైన పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెన్‌ తీసి మరిది జేబులో పెడుతూ అతడిని ఆశీర్వదించారు. వదినమ్మ ఇచ్చిన బహుమతిగా మురిసిపోయిన పవన్‌ ఆమెను హత్తుకుని నుదుడిపై ముద్దుపెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి వచ్చిన పవన్ జేబుపై చేయి పెట్టి ఏదో చెబుతూ కనిపించారు. ఇలా ఎమోషనల్‌ సాగిన ఈ వీడియో మధ్యలో ఓ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చారు. పవన్‌ పెన్నుతో సంతకం పెడుతుండగా.. "తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ... వదిన, అన్నయ్య" అని పేర్కొన్నారు.






ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మరోసారి ఈ అన్నదమ్ముల ఆప్యాయతకు మెగా ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. కాగా ఎన్నికల ప్రచారం నుంచి మెగా కుటుంబమంతా పవన్‌ వెంట నడిచింది. ప్రతి ఒక్కరు ఆయనకు మద్దతు తెలిపారు. ఇక రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్‌ తేజ్‌లో నాగబాబు సతీమణి పిఠాపురం వెళ్లి మరి పవన్‌తో కలిసి ప్రచారం చేశారు. ఇక చిరంజీవి.. ప్రజలకు ఏదో మంచి చేయాలని తపించే మనస్తత్వం కళ్యాణ్‌ బాబుది అని, తనని గెలిపించాలంటూ ఏపీ ప్రజలకు చిరు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. అలా పవన్‌ గెలుపుని ఆకాంక్షిస్తూ మెగా కుటుంబమంత ఒక్కటిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 



Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - నటుడు అజయ్‌ ఘోష్‌ ఊహించని కామెంట్స్‌‌, ఏమన్నాడంటే!