Bhairava Anthem Song Promo Out: ట్రైలర్‌తో 'కల్కి' మూవీ అంచనాలు మరింత పెరిగాయి. మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ'పై ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌. ఇక మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుంటంతో సినిమా నుంచి వరుసగా అప్‌డేట్స్‌ పెంచుతూ బజ్‌ క్రియేట్‌ చేస్తుంది మూవీ టీం. వైజయంత్రి మూవీస్‌ పతాకంపై అశ్విన్‌ దత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.


విశ్వనటుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దుల్కర్‌ సల్మాన్‌ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తుండంతో ముందు నుంచి కల్కిపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. పైగా సైన్స్‌ ఫిక్షన్‌గా టైం ట్రావెలర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈసినిమా కోసం స్పెషల్‌ రోబోటిక్‌ కారును కూడా డిజైన్‌ చేశారు. ఈ సినిమా బుజ్జిగా కీ రోల్‌ పోషిస్తున్న ఈ కారు ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేసింది మూవీ టీం. బుజ్జి అండ్‌ భైరవ పేరుతో యానిమేషన్‌లో వెబ్‌ సిరీస్‌ను ఓటీటీలో తీసుకువచ్చాడు నాగ్‌ అశ్విన్‌. ఇలా కల్కి ప్రమోషన్స్‌ సైతం సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్‌ చేస్తున్నాయి.



ఈ క్రమంలో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ తాజాగా కల్కి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్‌ చేసింది. భైరవ ఆంథమ్‌ సాంగ్‌ పేరుతో తాజాగా పాట ప్రోమోను రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఈ సాంగ్‌ మొత్తం పంజాబి స్టైల్లో సాగనుందని ప్రోమో అర్థమైపోతుంది. పంజాబి రాప్‌ సింగర్‌ దిల్‍జీత్ దోసంజ్ ఈ పాటను ఆలపించారు. 21 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్‌ పంజాబీ స్టైల్లో సాగింది. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు సింగర్‌ దిల్‍జీత్ దోసంజ్ కనిపించడం విశేషం. భైరవ ఆంథమ్‌ సాంగ్‌ అంటూ దిల్జిత్‌ వర్సెస్‌ ప్రభాస్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.






ఇందులో ప్రభాస్‌ ఫుల్‌ స్టైలిష్‌గా కనిపించాడు. ఈ ప్రోమోలో పభాస్‌, దిల్జిత్‌ సింగ్‌లు ఇద్దరు చేతులు కలుపుతూ కనిపించారు. ఇక సంతోష్‌ నారాయణ్‌ అందించి మ్యూజిక్‌ బాగా ఆకటత్టుకుంటుంది. ట్రెండీ ఫాస్ట్‌ బీట్‌తో సాగిన ఈ పాట మొత్తం పంజాబీ స్టైల్లో సాగింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇక ఫుల్‌ సాంగ్‌ రేపు (జూన్‌ 16) విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రోమోలోనే వెల్లడించింది మూవీ టీం. ఈ ప్రోమో రిలీజ్‌ సందర్భంగా ఇద్దరు ఐకాన్స్, ఒక్క ఆంథమ్ అంటూ ప్రభాస్, దిల్జీత్ చేతులు కలిపిన పోస్టర్ రిలీజ్ చేసి ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సాంగ్‌ అని క్యాప్షన్‌ ఇచ్చి ఫస్ట్‌ సాంగ్‌పై హైప్‌ ఇచ్చింది మూవీ టీం. 


Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - నటుడు అజయ్‌ ఘోష్‌ ఊహించని కామెంట్స్‌‌, ఏమన్నాడంటే!