మెగాస్టార్ చిరంజీవి ఎంత నిరాడంబరంగా ఉంటారో తెలిసిందే. సామాన్యుడి స్థాయి నుంచి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది టాలీవుడ్‌లో హీరోలుగా ఎదిగారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కూడా చిరంజీవి నుంచే నేర్చుకోవాలి. అందుకే, ఆయన ఎంతోమంది అభిమాన నటుడు అయ్యారు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కుటుంబాన్ని ప్రేమించడం కూడా ఆయన నుంచే నేర్చుకోవాలి. 


ఇన్నేళ్ల తన సినీ జీవితంలో ఆయన అభిమానులనే కాదు.. ఆస్తులను కూడా గట్టిగానే కూడగట్టారు. టాలీవుడ్‌లోనే అత్యధిక ధనిక సెలబ్రిటీల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నారంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. రాఖీ సందర్భంగా చిరంజీవి చెల్లెళ్లు గురువారం రాఖీ కట్టారు. ఆ ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అయితే, ఈ ఫొటోల్లో చిరంజీవి రాఖీల కంటే ఆయన పెట్టుకున్న వాచ్ ఎక్కువ హైలెట్ అవుతోంది. దీంతో ఆ వాచ్ ధర ఎంత ఉంటుందనే చర్చ నడుస్తోంది. 


చిరంజీవి పెట్టుకున్న ఆ వాచ్ ధర తెలుసుకోడానికి అంతా ఆన్‌లైన్‌లో వెతికేస్తున్నారు. ఆ వాచ్ ధర తెలుసుకుని షాకవుతున్నారు. ఇంతకీ ఆ వాచ్ ధర ఎంతనేగా మీ సందేహం? చిరు పెట్టుకున్న ఆ వాచ్ రొలెక్స్ (Rolex) కంపెనీది. ఆన్‌లైన్‌లో దీని ధర 2,35,000 డాలర్లుగా ఉంది. అంటె మన భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం.. రూ.1.94 కోట్లు. అంటే, ఈ ధరతో హైదరాబాద్‌లో మూడు లేదా నాలుగు త్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు కొనేయొచ్చు. మెగాస్టార్ ఇమేజ్ ఉన్న హీరోకు ఇంత ధర ఉన్న వాచ్ ఉందంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇదే బ్రాండ్, డిజైన్ వాచ్‌‌లు వాడుతున్నారు. 


Rolex Daytona Eye of the Tiger White Gold వాచ్ మోడల్‌ను ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నారు. బాస్కెట్ బాల్ ఐకాన్ లెబ్రోన్ జేమ్స్, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ సెన్సేషన్ నెమార్ జూనియర్, భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తదితరులు వాచ్ వాడుతున్నారు. ఈ వాచ్ అంత ధర పలకడానికి కారణం.. అందులో ఉండే వజ్రాలే. 36 బాగెట్-కట్ డైమండ్స్‌తో ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. గోల్డ్, సిల్వర్ ప్లేట్స్‌పై వీటిని అమర్చారు. వేరియెంట్లు బట్టి ఈ వాచ్ ధరలు ఉన్నాయి. రూ.74 లక్షలు మొదలై.. రూ.2 కోట్ల వరకు ఈ వాచ్ ధర ఉంటుంది. 






కొత్త కథలతో వస్తున్న చిరు


‘వాల్తేరు వీరయ్య’ హిట్ సంతోషాన్ని ‘భోళాశంకర్’ తుడిచిపెట్టేసింది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అంతేకాదు 'బోలా శంకర్' రిజల్ట్ తో 'సోగ్గాడే చిన్నినాయన' దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ చేయాల్సిన 'బ్రో డాడి' రీమేక్ కూడా ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రీమేక్ సినిమాల జోలికి వెళ్లకుండా ఫ్రెష్ స్టోరీలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలను ప్రకటించారు. అందులో ఒకటి ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట్ కావడం విశేషం. మరో మూవీని చిరంజీవి కుమార్తె సుశ్మిత కొణిదెల నిర్మించనుంది.


Also Read నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?