ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా కమర్షియల్ హంగులు, కుటుంబ అనుబంధాలు మేళవించి సినిమాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను తీసిన సినిమా 'స్కంద' (Skanda Movie). విడుదలకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. అయితే, అప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు దాదాపుగా వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.


'స్కంద' విడుదలకు ముందు సెంచరీ!
'స్కంద' బడ్జెట్ ఎంత? ప్రస్తుతానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి బయటకు ఏమీ చెప్పలేదు. అయితే, వంద కోట్లకు అటు ఇటుగా ఉండవచ్చని అంచనా. ట్రైలర్ చూస్తే ఖర్చు గట్టిగా చేశారని అర్థం అవుతోంది. అందుకు తగ్గట్టుగా రాబడి కూడా ఉంటోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 98 కోట్లు వచ్చాయని తెలిసింది. 


సౌత్ రైట్స్ @ రూ. 54 కోట్లు
Skanda OTT Platform : 'స్కంద' సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ కూడా ఓ భాగస్వామి. అయితే... హిందీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మాత్రమే తమ దగ్గర ఉంచుకుని దక్షిణాది భాషల ఓటీటీ, శాటిలైట్ రైట్స్ స్టార్ నెట్వర్క్ గ్రూప్ (Disney Plus Hotstar)కి విక్రయించింది. 


Also Read : ఆలియా భట్ కావాలి, పాట పాడాలి - యాక్షన్ & కామెడీతో ఇరగదీసిన షారుఖ్ ఖాన్ 'జవాన్' ట్రైలర్


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... నాలుగు భాషలకు చెందిన 'స్కంద' ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్, దాని అనుబంధ చానళ్ళు సొంతం చేసుకున్నాయి. రూ. 54 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు తెలిసింది. 


హిందీ ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ @ 35 కోట్లు
Skanda Movie Hindi OTT Platform : 'స్కంద' హిందీ ఓటీటీ శాటిలైట్, థియేట్రికల్ హక్కులను రూ. 35 కోట్లకు జీ స్టూడియోస్ తీసుకుంది. ఆడియో రైట్స్ ద్వారా మరో రూ. 9 కోట్లు వచ్చాయని సమాచారం. వీటి ద్వారా విడుదలకు ముందు నిర్మాతకు 98 కోట్లు వచ్చాయి. అంటే... ఆల్మోస్ట్ సెంచరీ కొట్టినట్లే. రామ్ కెరీర్ చూస్తే... ఇది రికార్డ్ అమౌంట్ అని చెప్పాలి. ఇటీవల సినిమా విడుదలకు ముందు ఈ స్థాయిలో బిజినెస్ చేసిన సినిమా మరొకటి లేదని కూడా చెప్పాలి. 


Also Read నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?



తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.  'స్కంద' ట్రైలర్ అంతా బోయపాటి మాస్ హీరోయిజం కనిపించింది. యాక్షన్ సీన్లు హైలైట్ అయ్యాయి. ఆల్రెడీ మూడు సాంగ్స్ విడుదల చేశారు. మొదటి రెండు పాటలను హీరో హీరోయిన్లపై తెరకెక్కించగా... మూడో పాటలో ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించారు.


రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో కథానాయిక. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial