Chiranjeevi: మెగాస్టార్ కాదు... చిరంజీవి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్
Laila Pre Release Event: చిరంజీవిని ఫ్యాన్స్ ముద్దుగా మెగాస్టార్ అంటారు. కొందరు బాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆయనకు విశ్వక్ సేన్ కొత్త ట్యాగ్ ఇచ్చారు. అది ఏమిటంటే...
Chiranjeevi to grace Vishwak Sen's Laila Pre Release event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'లైలా'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ రోజు హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. తన సినిమా వేడుకకు వస్తున్న చిరుకు విశ్వక్ సేన్ కొత్త ట్యాగ్ ఇచ్చారు.
మెగాస్టార్ కాదు... బాస్ ఆఫ్ మాసెస్!
అవును... మీరు చదివింది నిజమే. చిరంజీవికి విశ్వక్ సేన్ ఇచ్చిన కొత్త ట్యాగ్ 'బాస్ ఆఫ్ మాసెస్'. దీనిపై మెగా అభిమానులు, ఇంకా ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 'మాస్ కా దాస్ కోసం బాస్ ఆఫ్ మాసెస్ వస్తున్నారు' అంటూ 'లైలా' మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అదీ సంగతి!
Just In
సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు!
చిరంజీవి కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు కొన్ని ట్యాగులు ఏవో ఉన్నాయి. అందులో నట కిశోర, డైనమిక్ స్టార్, రోరింగ్ లయన్, రోరింగ్ స్టార్ వంటివి ఉన్నాయి. అయితే... 'కొండవీటి సింహం' సినిమాకు సుప్రీం స్టార్ అని వేశారు. ఆ తర్వాత అది సుప్రీం హీరో అయ్యింది. ఆ ట్యాగ్ చాలా రోజులు చిరు పేరుకు ముందు వినిపించింది. ఆ తర్వాత సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ అనేది కొన్నేళ్లుగా అందరి మనసుల్లో ముద్ర పడింది. మరి ఎప్పుడు కొత్త ట్యాగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
చిరంజీవి మెగాస్టార్ అయితే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. అందుకని చిరు తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా ఇంటర్ అయ్యాక ఆయనను 'మెగా పవర్ స్టార్' అన్నారు. ఇప్పుడు, 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా సమయం నుంచి ఆయనను గ్లోబల్ స్టార్ అంటున్నారు. చిరు ఫస్ట్ ట్యాగ్ సుప్రీం హీరోను మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కు ఇచ్చారు ఫ్యాన్స్. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ని మెగా ప్రిన్స్ అంటుంటే... ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె - మెగా మనవరాలు క్లీంకారా కొణిదెలను మెగా ప్రిన్సెస్ అంటున్నారు.
Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్ మీదకు, దర్శకుడు ఎవరంటే?
హీరోల ట్యాగుల్లో 'మాసెస్' కామన్!
హీరోలకు ట్యాగులు ఇచ్చే క్రమంలో 'మాసెస్' అనేది బాగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణను కొన్నేళ్ల క్రితం వరకు 'నట సింహం' అని ఫాన్స్ అంతా పిలిచేవారు. అయితే ఇటీవల ఆయనకు కొత్త ట్యాగ్ ఇచ్చారు. బాలయ్యను 'గాడ్ ఆఫ్ మాసెస్' అని అంటున్నారు.
ఇక నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ను యంగ్ టైగర్ అనేవారు. హరికృష్ణకు టైగర్ అనే ఇమేజ్ ఉంది అందుకని ఆయన తనయుడిని 'యంగ్ టైగర్' అన్నారు. కానీ, ఈ మధ్య ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు 'యంగ్ టైగర్' అనడం లేదు. ఆయనను 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అని అంటున్నారు. ఇప్పుడు చిరంజీవికి 'బాస్ ఆఫ్ మాసెస్' అనడం మొదలు పెట్టారు విశ్వక్ సేన్.