గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్... క్లుప్తంగా 'గామా' (Gama Awards). గల్ఫ్ గడ్డ మీద దుబాయ్ వేదికగా తెలుగు సినిమా రంగంలో అతిరథ మహారథులు పలువురితో ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికి నాలుగు ఎడిషన్స్ పూర్తి అయ్యాయి. ఐదో ఎడిషన్ నిర్వహించడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. గామా అవార్డ్స్ 2025 (Gama Awards 2025)కు సంబంధించి థీమ్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ఈవెంట్ డేట్ అనౌన్స్ చేశారు.

ఆగస్టు 30న దుబాయ్ వేదికగా 'గామా' అవార్డ్స్!Gama Awards 2025 Event Date: 'గామా' థీమ్ సాంగ్ విడుదల కార్యక్రమం దుబాయ్‌లో జరిగింది. ఆ పాటకు ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించగా... స్వరకర్త, గాయకుడు రఘు కుంచె బాణీ అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. అక్కడ షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో ఆగస్టు 30న ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుక నిర్వహిస్తామని వివరించారు.

'గామా అవార్డ్స్'కి ఎవరెవరు అటెండ్ అవుతారు?Who will attend GAMA Awards2025?:'గామా అవార్డ్స్ 2025' కార్యక్రమానికి యువ కథానాయకులు సిద్ధూ జొన్నలగడ్డ, తేజా సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీవిష్ణు, రోషన్ హాజరు కానున్నారని తెలిపారు. హీరోయిన్లలలో 'సంక్రాంతికి వస్తున్నాం'తో భారీ విజయం అందుకున్న మీనాక్షి చౌదరితో పాటు దక్ష నాగర్కర్ సహా పలువురు ప్రముఖులు హాజరు అవుతారని నిర్వాహకులు తెలిపారు. 'గామా అవార్డ్స్ 2025'లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ, 'జాతి రత్నాలు' భామ ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తారని తెలిపారు.

Also Readబ్రాహ్మణులు రేపిస్టులా? '8 వసంతాలు' టీంపై మీడియా ఫైర్... సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన  డైరెక్టర్!

ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్వినీదత్, డీవీవీ దానయ్య విశిష్ఠ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 24 శాఖలకు సంబంధించి వివిధ విభాగాల్లో పురస్కారాలు అందిస్తామని నిర్వాహకులు వివరించారు.

'గామా అవార్డ్స్ 2025' జ్యూరీ మెంబర్స్ ఎవరు?Gama Awards 2025 Jury Members: 'గామా అవార్డ్స్ 2025' జ్యూరీకి చైర్ పర్సన్స్ కింద సీనియర్ దర్శకులు బి గోపాల్, ఎ కొదండరామిరెడ్డి, సంగీత దర్శకులు కోటి వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విజేతలను ఎంపిక చేశారు. పది వేల మంది ప్రేక్షకులు పురస్కార వేడుకలకు వస్తారని అంచనా ఉందని. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని 'గామా అవార్డ్స్' అధ్యక్షుడు త్రిమూర్తులు, సీఈవో సౌరభ కేసరి తెలిపారు.

Also Readడ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్ట్... చెన్నైలో రాజకీయ నాయకుడికీ లింకులు?