ఫోన్ ట్యాపింగ్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేస్తోంది. తెలంగాణలోని కేసీఆర్ - కేటీఆర్‌తో బంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని జగనన్న మీద వైఎస్ షర్మిల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అది పక్కన పెడితే... ఏపీ, తెలంగాణలో ఎన్నికలకు ముందు పలువురు సెలబ్రిటీలు - దర్శక నిర్మాతల ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ కూడా బాధితులే అనేది కొత్తగా తెలిసిన అంశం.
సిట్ అధికారుల ముందుకు భరత్ భూషణ్!Telugu Film Chamber Of Commerce President Bharat Bhushan: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 23న) సిట్ ముందు భరత్ భూషణ్ హాజరు అయ్యారు.
ఎన్నికల ముందు ఆరు నెలల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఫోన్ ట్యాప్ అయినట్లు ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఇందులో మరో అనుమానానికి తావు లేదు. ఆయన ఈ రోజు సిట్ ముందు హాజరు కావడం వల్ల ఈ విషయంలో స్పష్టత వచ్చింది. తన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎవరెవరితో మాట్లాడిన రికార్డ్ చేశారు? ఆ సమాచారం ఎవరికి చేరవేశారు? వంటి అంశాలను అధికారులను భరత్ భూషణ్ అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అనేది ఇండస్ట్రీలో పెద్ద పదవి. రిలీజ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వంటి సెక్టార్లలో సమస్యలు వస్తే అందరూ ఛాంబర్ తలుపు తడతారు. మీడియాలో కనిపించడానికి, లైమ్ లైట్‌లోకి రావడానికి భరత్ భూషణ్ పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఆయన సాల్వ్ చేసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఫైనాన్షియల్ పంచాయతీల నుంచి గొడవల వరకు ఆయన సున్నితంగా పరిష్కరించారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతాయి. ఆయన ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటినీ టార్గెట్ చేశారని అనుకోవాలి.
Also Read: బ్రాహ్మణులు రేపిస్టులా? '8 వసంతాలు' టీంపై మీడియా ఫైర్... సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన డైరెక్టర్!