మీకు గుర్తుందా? ఈ చీజ్ బజ్జీ అమ్మాయి? అయితే, కొద్ది రోజులు వెనక్కి వెళ్లండి. హైదరాబాదులోని ఓ పబ్‌లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ కేసులో పోలీసులు పలువురు సెలబ్రిటీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉంది. ఆమెతోపాటు ఈ చీజ్ బజ్జీ యువతి కూడా ఉంది. ఆమె పేరు కుషిత కల్లాపు. ఇప్పటికే మీరు ఈమెను మీరు పలు సినిమాల్లో చూసి ఉంటారు. ముఖ్యంగా యూట్యూబ్ సీరిస్‌లు, షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ చూసేవారికి ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పుడు చీరలో అందంగా ముస్తాబై.. కుర్రాళ్ల మనసు దోచేస్తుంటాది ఈ చిన్నది. మరి, ఆమెను ఎందుకు చీజ్ బజ్జీ గర్ల్ అని పిలుస్తున్నారనేగా మీ డౌట్?


డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ఎదుర్కొన్న కుషితాను పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా ఆమె తాను కేవలం ఫుడ్ కోసమే అక్కడికి వెళ్లామని తెలిపింది. తన ప్రెండ్స్‌తో కలిసి చీజ్ బజ్జీ కూడా ఆర్డర్ ఇచ్చామని చెప్పింది. అంతే, ఆమె మాటలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. పబ్‌కు వెళ్లి బజ్జీలు తినొచ్చిందట అంటూ  మీమర్స్ ఓ ఆట ఆడుకున్నారు. మొత్తానికి అలా వైరల్ కావడమే కాదు.. చీజ్ బజ్జీ పేరుతో పాపులర్ అయిపోయింది. 


అవన్నీ పక్కన పెడితే.. కుషిత ఇప్పుడ ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ మూవీలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. కుషిత ఇది వరకు కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే, అంతగా ప్రాధాన్యంలేని పాత్రల్లోనే కనిపించింది. అయితే, ‘గుంటూరు కారం’లో ఆమెకు మంచి పాత్రే దొరికిందని టాక్. అంతేగాక హీరో రవితేజ నిర్మిస్తున్న ఓ లో-బడ్జెట్ మూవీలో కూడా కుషితకు ఛాన్స్ వచ్చిందని తెలిసింది. కుషిత ఇప్పటికే సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. సినిమాల్లో ఛాన్స్ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి కుర్రాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ, ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు.




రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా ‘చాంగురే బంగారు రాజా’ అనే మూవీకి కుషితాను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. కానీ, షూటింగ్ మొదలైన తర్వాత ఆమెను తొలగించినట్లు సమాచారం. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ సినిమాలో కూడా కుషిత నటించింది. గోపీచంద్‌ అన్న కూతురిగా కనిపించింది. అయితే, ఆ పాత్రకు సినిమాలో అంత ప్రాధాన్యం లేదు. పైగా ఆ మూవీ ఫ్లాప్ కావడంతో.. ఆ చిన్న అవకాశం కూడా ఛాన్సులు పెంచలేకపోయింది. మరి, మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీతోనైనా కుషిత ఫేట్ మారుతుందేమో చూడాలి. 


Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial