నృత్య దర్శకుడిగా హీరోలతో పాటు ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి రాఘవా లారెన్స్ (Raghava Lawrence). ఆయన కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు... కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు కూడా! ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'చంద్రముఖి 2' (Chandramukhi 2 Movie).
అప్పుడు జ్యోతిక... ఇప్పుడు కంగన!
'చంద్రముఖి' పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు కూడా ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ, తెలుగు భాషల్లో ఆ సినిమా మంచి విజయం సాధించింది. రజనీకి రాఘవా లారెన్స్ వీరాభిమాని. 'చంద్రముఖి 2'లో నటించే ముందు అభిమాన హీరో దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
'చంద్రముఖి'గా జ్యోతిక అభినయాన్ని కూడా మరువలేం. ఇప్పుడీ 'చంద్రముఖి 2'లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేశారు. 'చంద్రముఖి' తీసిన పి వాసు దర్శకత్వం వహించారు.
తెలుగులో శ్రీలక్ష్మీ మూవీస్ విడుదల
ఈ నెల (సెప్టెంబర్) 28న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా 'చంద్రముఖి 2'ను విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది.
ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్
Chandramukhi 2 pre release event Hyderabad : ఇటీవల విడుదలైన ట్రైలర్, 'చంద్రముఖి 2' పాటలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ నెల (సెప్టెంబర్) 24న 'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నారు.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
పదిహేడు సంవత్సరాల క్రితం తాన బందీగా ఉన్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించిన చంద్రముఖి విఫలమైంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తన పగ తీర్చుకోవటానికి మరోసారి ముందుకు వస్తోంది.
Also Read : మహేష్, చరణ్ నవ్వులు... అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు ముచ్చట్లు - ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో స్టార్స్
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'లో వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవి మారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వైజీ మహేంద్రన్, రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు ఇతర తారాగణం. సాంకేతిక వర్మ విషయానికి వస్తే... ఈ చిత్రానికి కూర్పు : ఆంథోని, స్టంట్స్: కమల్ కన్నన్ - రవి వర్మ - స్టంట్ శివ - ఓం ప్రకాష్, ఛాయాగ్రహణం : ఆర్.డి రాజశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సంగీతం : ఎం.ఎం. కీరవాణి, నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్, నిర్మాత : సుభాస్కరన్, దర్శకత్వం : పి వాసు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial