Poonam Pandey Death Reason: ప్రస్తుతం బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణ వార్త చుట్టూ ఎన్నో రూమర్స్ తిరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అసలు ఈ మరణ వార్త నిజమే కాదు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు తను సెర్వికల్ క్యాన్సర్ వల్ల మరణించలేదని మరికొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం పూనమ్ పాండే మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది టీమ్. అప్పటినుండి సోషల్ మీడియాలో పూనమ్ గురించి పోస్టులు ఎక్కువయ్యాయి. ఆర్‌ఐపీ అంటూ బాలీవుడ్‌తో పాటు ఇతర భాషా ప్రేక్షకులు కూడా తన మృతికి సంతాపం తెలియజేశారు. కానీ ఇంతలోనే అసలు పూనమ్ పాండే మరణించింది సెర్వికల్ క్యాన్సర్‌తో కాదు అనే రూమర్ బయటికొచ్చింది.


డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్లే..


32 ఏళ్ల వయసులోనే పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్‌తో మరణించిందనే విషయం ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని ముందుగా తన మ్యానేజర్ ప్రకటించాడు. కానీ వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్‌తో కాదు.. డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల చనిపోయిందని తెలుస్తోంది. ‘‘ఈ ఉదయం మేం ఎంతో బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నాం. మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంది. ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ తను మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు పూనమ్ పాండే టీమ్. 


నమ్మలేకపోతున్నాను..


పూనమ్ పాండే మరణ వార్త తన బాడీగార్డ్ అమీన్ ఖాన్‌ను సైతం షాక్‌కు గురిచేసింది. తను ఈ విషయం నమ్మలేకపోతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది వినగానే పూనమ్ అక్కకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా రీచ్ అవ్వలేదని బయటపెట్టాడు. జనవరి 31న ఒక ఫోటోషూట్ కోసం ముంబాయ్‌లోని ఫినిక్స్ మాల్‌కు వెళ్లింది పూనమ్ పాండే. ఆ సమయంలో అమీన్ ఖాన్.. తన పక్కనే ఉన్నాడు. ‘‘తను చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగానే అనిపించింది. తను ఎప్పుడూ తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యను షేర్ చేసుకోలేదు. నాకు కూడా తన ఆరోగ్యం బాలేదని ఎప్పుడూ అనిపించలేదు. తన అక్క వచ్చి నిజం చెప్తుందని ఎదురుచూస్తున్నాను’’ అంటూ పూనమ్ పాండే మరణ వార్తపై స్పందించాడు బాడీగార్డ్ అమీన్ ఖాన్.


ఆఫ్ స్క్రీన్ కూడా బోల్డ్‌గా..


బాలీవుడ్‌లో ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా బోల్డ్‌గా కనిపించి.. ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది పూనమ్ పాండే. 2013లో విడుదలయిన ‘నషా’ మూవీతో నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూనమ్. ఆ సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్‌తో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘నషా’ తర్వాత ‘లవ్ ఈజ్ పాయిజన్’, ‘మాలిని ఆండ్ కో’, ‘ఆ గయా హీరో’, ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ వంటి సినిమాల్లో మెరిసింది.  


Also Read: పూనమ్‌ పాండే చనిపోలేదా? - ఇదంతా పబ్లిసిటీ స్టంటా! నటి మృతిపై నెటిజన్ల రియాక్షన్‌